పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరాత్రంతా ఊరంతా ఊరేగించేవారు. కొందరు పల్లకిముందు భట్రాజుల పొగడ్తలుకూడా పెట్టేవారు.పెట్రొమాకుల్లెటు,కాగడాల కాంతుల్లోయీ ఊరేగింపు సాగుతుంటే ఊరంతటీకి వేడుకే. పల్లకిలో పెళ్ళికూతురు రాత్రంతా తలవంచుకునేకూర్చొనేది సిగ్గుతో. ఈ తలవంచుకోవడాన్ని గురించి చింతామణి నాటకంలో దామోదరుడు ఒకవిపరీతార్ధం చెబుతాడు. తన బార్య తనని చప్పిదవడలనీ, గుంటకళ్ళనీ, బొర్రముక్కనీ అంటుందనీ పెళ్ళివారు తాను పల్లకీలో తలవంచుకుకూర్చున్నది,పరిపాళ్ళిందుకేనట అంటాడు హాస్యధోరణిలో. (ఇప్పుడెవరూ అది హాస్యపాత్రలా చెయ్యడం లేదులెండి స్వారస్వం తెలియక).

                     ఒ ప్ప గిం త లు

సన్నివేశం విషాదభరితమైనా యిదీ ఒక వేడుకే. పిల్లను అత్తవారింటికి సాగనంపేటప్పుడు ఏ తండ్రి హృదయం ద్రవించదు! శకుంతలను పంపించేటప్పుడు కణ్వుడంతమహర్హే ద్రవించిపోయాడు. కలకాలం పెంచినప్రేమ కరుణరూపంలో కట్టలుత్రెంచుకు ప్రవహిస్తుంది. ఇది చూసినచ్వాళ్ళకు 'కాళిదాసు ఆసన్నివేశాన్ని ఎంతసహజంగా వ్రాసాడు!' అనిపిస్తుంది. అందుకే 'కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల! అంటారు. ఆ శకుంతలనాటకంలోకూడా కణ్వుడు శకుంతలను అత్తవారింటికి సాగనంఫే సన్నివేశమే గొప్పదన్నారు. ఆ కణ్వహృదయమే ఏతిల్లి దండ్రులదైనా - ఇక్కడ.

"ఒప్పగింతమ్మా ఒప్పూలాకుప్పానిన్నొప్పా గించితమ్మా
మచెట్లకూ నీరు ఎవరూ పోతురమ్మా,
మాపూలచెట్లానూ ఎవరూతీతురమ్మా,
మాలేగలన్నీటినీ ఎవరూ సాకెదరమ్మా"

అంటూ ఆమె పుట్టింటి దినచర్యలన్నీ తలపుకుతెస్తూఆడే ఒప్పగింతపాట ప్రత్రి హృదయాన్నీ కదలిస్తుంది. అందులోనూ "పుట్టినింటిని పొగడకు, మెట్టినింటిని తెగడకు" అనీ, "అరిటాకువంటిదీ ఆడజన్మంబు, ఎవ్వరేమన్ననూఎదురాదబోకే" అనేహితోపదేశలు విషాదంలో కూడా