పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క రి వే పా కు

దీనిలో విటమిన్ 'ఎ ' పుష్కలంగా వుంది. పైత్యహారి - జీర్ణకారి. కాని ఇప్పుడు దీనిని విస్మరించి మనవాళ్ళు కూరల్లో చారుల్లో ఏదో సువాసనకోసం వేసినట్లు భావించి తినేటప్పుడు ఏరిపారవేస్తారు. అందుకే ఎవరినైనా అనవసరమున్నప్పుడు వాడుకుని సమాయానికి దూరంగా గెంటివేస్తుంటే వాడిది పాపం కరివేపాకుబ్రతుకురా అంటుండడం వాడులో కొచ్చింది.

అసక్య్ వెంకటేశ్వరస్వామి జనపదకధలో దీనికి చలా ప్రాముఖ్యముంది. అలివేలుమంగమ్మ సారెలో కరివేపాకు తేలేదనేగదా వెంకన్న బాబు ఆమెను ఏలుకోను పొమ్నన్నాడు.

                            బొ ప్పా యి

ఈ పండులో మాంసకృత్తులు మెండు. జీర్ణశక్తినిండు. మాంస తొందరగా మెత్తగా ఉడికించాలంటే రెండు పచ్చిబొప్పాయి ముక్కలు వేసి ఉడికిస్తే చాలు, ఇట్టే మొత్తనైపోతుంది. ఈ పండు చక్కెర వ్యాదిని తగ్గిస్చుంది.

                                ని  మ్మ

ఈ పండు విటమిన్ 'సి 'కి నిలయం. వేడిచేసే కూరలన్నిటిలోనూ ఇది వాడతారు చలవకోసం. నిమ్మరసం ఒంటికిరుద్ది కొంతసేపయ్యాక స్నానంచేస్తే వొంటికి మంచి చాయనిస్తుంది నిమ్మకాయ చిప్పలు ఎండబెట్టి నలుగుపిండిలోకలిపి రాస్తే శరీరానికి కాంతినిస్తుంది. వేడిచేసినప్పుడు నిమ్మరసంలో పంచదార వేసుకొని నీళ్ళలో కలిపిత్రాగితే చల్లబరుస్తుంది. ఉదయం పరగడుపున ఒక కాయ నిమ్మరసం చెంచాడు తేనెలో కలిపి త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది. ధారుపుస్టి కలిగిస్తుంది.

మొక్కలన్నింటిలోకి యీమొక్క వీరక్కువ త్రాగుతుంది. ఎన్నినీళ్ళుపోసినా పోసినట్టు కనిపించదు. అందుకే ఎవరైనా గుంభనంగా ఉలుకుపలుకు లేకుండా ఉంటే నిమ్మకునీరత్తినట్టు అలాగున్నావేమిటిరా అంటుంటారు.