పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుడ్డలో కట్టి జలుబుచెసినప్పుడు ముక్కుదగ్గర పెట్టుకు పీలిస్తే ఉపశమనం కలుగుతుంది. నడుమునొప్పికి, ఇరుకు నొప్పులకె ములగాకు, వామ్ము కట్టు గొప్పగా పనిచేస్తుంది.

                            ప సు పు

ఇది క్రిమిసంహారిణి. ఆరోగ్యానికి అత్యంతావశ్యకం. సెప్టిక్ ను నిరోధిస్తుంది. పూర్వకాలంలో మగవాళ్ళ పాముకోళ్లు, పాదరక్షలు ధరించినట్లుంది గాని స్త్రీలు ధరించినట్లు లేదు. అందువల్ల కాలికి ఏదైనా దెబ్బ తగిలినా సెప్టిక్ కాకుండా ముందుజాగ్రత్తగా పాదాలకు పసుపు పారాణిరాసేవారు. లివర్ జబ్బులకు మంచిమందు. స్త్రీలకు రోమనివారిణి. జానపదస్త్రీలు ముఖానికి నిండుగా పసుపు రాసుకుంటారు. నగరీకులు పౌదర్లమోజుల్లో దీన్ని విస్మరించడంతొ చాలామంది స్త్రీలకు మీసాలు చూస్తున్నాం. ఇది మంచి జీర్ణకారికూడా - అందుకే ప్రతికూరలోనూ వేస్తారు. దీనికి మలేరియా నిరోధక శక్తివుంది. ఇళ్లలో పసుపునీళ్లు చల్లడంలో శుభం మాట ఎలవున్నా క్రిములనుచంపే శక్తిగా వినియోగించడం దీని వనుకవున్న రహస్యం.

                          ఉ సి రి క

దీన్ని అమృతఫలం అంటారు. దీనినిండా 'సి " విటమినే. పాత ఉసిరికాయ పచ్చడి పత్య్హానికి మంచిది. మనకు ప్రౌఢభాషలో 'కరతలామలకం' అనె మాటవుంది. దీనర్ధం 'అరచేతిలో ఉసిరికాయ ' అని. ప్రతి యింటిలోనూ యివిపెంచుతారు. కనుక సులువుగా లభ్యమయ్యేది.

'సి ' విటమిను సరిపడా లేకుంటే దేహంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి ఏవ్యాధి అయినా యిట్టేసోకే ప్రమాదముంది. నేటి 'ఎయిడ్సు ' వ్యాధికి దీనినుండి ఏదైనా మందు కనిపెట్టవచ్చేమో ఆయుర్వేదపరిశోధకులు ఆలోచించడం మంచిది. పచ్చిఉసిరికాయ దాహాన్ని తగ్గిస్తుంది. అందుకే మందుటెండలో ప్రయాణించేవారు రాచఉసిరికాయ వెంట తీకుకొని పోతుంటారు.