పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అ ర టి

అదితులు, బందువులు, ఏవేళ్ళొచ్చినా కంగారుపడకుండా అర్జంటుగా ఆదుకోనటానికి ఇంటిలోని అరటిచెట్టు పెద్ద అండ. చెట్టునున్న గెలనుంచి కాయలుకోసి కూరవండి తృప్తిగా పెట్టవచ్చు. అరటిపువ్వు కడుపులోని అల్సర్ కి మందు. అరటిదువ్వ తింటే చలువచేస్తుంది. అరటిపండు సుఖవిరేచనకారి. అరటిపండులోనిగింజలపౌడరు తింటే మసూచి దరికి రానివ్వదు. అరటి ఆకులు అన్నం, టిఫినూ తినడానికి చాలాఉపయోగిస్తాయి. అరటిపువ్వు వలిచాక చివరనమిగిలిన లింగం నమిలితే కడుపులో నులిపురుగు చచ్చిపోతుంది.(ఎమీబియసిస్) నోటిపూతకూడా పోతుంది.

                        కొ బ్బ రి

ఈ కాయను నారికేళఫలం అంటారు. కొబ్బరినీరు నీరుడు దోషాన్ని తొలగిస్తుంది. చలువచేస్తుంది. ఎండాకాలంలో దీని ప్రతిభ అద్బుతం లోని గుంజు మంచి బలవర్ధకాహారం. గాంధీగారు (మహాత్మాగాంధీ) దీన్నే ఎక్కువ భుజించేవారు. దురదలు కొబ్బరిపాలు రుద్దితే పోతాయి. కొబ్బరిపాలతో తల రుద్దుకుంటే అకాలపుతల నెరదంటారు. వెంట్రుకలు ఊడిపోవడాన్ని ఆపుచేస్తుంది. కొబ్బరిడొక్క పొయ్యిలోకి ఉపయోగిస్తుంది. కొబ్బరిపీచు త్రాడుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆకు చాపలకు పనికొస్తుంది. కాయ అమ్మకానికి విలువైనది. అందుకే కొబ్బరిచెట్టును కొంగుబంగారామన్నారు.

ఈ చెట్లవల్ల యిన్ని లాభాలుండబట్టే "సస్యశ్రీ" గారు "చెట్టు నాజట్టు" అన్నారు కవితారూపంలో.

                            కూ ర గా య లు

దొండకాయ చక్కెరవ్యాధి మీద చక్కగా పనిచేస్తుంది. కదుపులోని కల్మషం పోవడానికి చిన్నప్పుడు దొండాకుపసరు ఉగ్గు పెడతారు. అందుకే ఏదైనా తగువొచ్చినప్పుడు, శత్రువుని కసిగా తిట్టేటప్పుడు "దొండకాయపసరు కక్కిస్తా" అంటుండడం వింటుంటాం. అంటే దాని