పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/439

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈఆటలో నిలుచున్నవాళ్ళు దొంగంచూసుకుంటూ తిరగడం, కూర్చున్నవాళ్ళు ఎప్పుడి తనకు 'కొక్కో ' పెడతారో అని ఏమరుపాటు లేకుండా చూసుకుంటుండడం ముఖ్యం. ఇది నేడు కొన్ని మార్పులు చేర్పులతో "కో" ఆటగా అంతర్జాతీఅప్రసిద్ధిపోందింది. నిజానికి యివి ఆడపిల్లలఆటలేఅయినా కొన్ని చోట్ల మగవాళ్ళు, కొన్నిచోట్ల పెద్దవాళ్ళూ కూడా ఆడేవారు.

                               ఆ కు ఆ ట
     సాధారణంగా పంటలుచేసుకొని దొంగను నిర్ణయిస్తారు. మరో పద్ధతికూడా ఉంది.  "ఆకు, పాకు, కరేపాకు, డా, ఢూం, చీ" అని పాడుతూ ఒక్కోమాట ఒక్కొమనిషిమీద లెక్కిస్తూ చివరిమాటపడినవారిని పండిపోయినట్టు ప్రకటిస్తారు.  దానికిమారుగా కొందరు "అగ్గిపెట్టి, గుగ్గిపెట్టి, కోడి, కొంగ, ఫిరంగి, పిల్ల, సిద్" అని పాడి పండిస్తారు.  ఈపాటకు బదులు కొన్నిచోట్ల 'ఉడుం, తుడుం, తుటేల్, మటేల్, సాం, పరంగ్, రూట్, మాట్, చేట్, దెబ్బ" అనికూడా పాడతారు.  ఈవిధంగా అనేకసార్లు పాడుతూలెక్కించి పండించగా మిగిలిపోయిన చివరివ్యక్తి దొంగ.  అతనిని ఫలానాచెట్టు ఆకు తెమ్మంటారు.  అతడు దానికోసం వెళ్ళగానే మిగిలివారంతా దాక్కుంటారు.  దొంగ ఆ ఆకుతో వచ్చి వీరిలో ఎవరినయినా ముట్తుకుంటే ఆముట్టుకోబడ్డవ్యక్తి దొంగగా మారతాడు.  కొన్నిచోట్ల ఇద్ధరు దొంగలనుకూడా నిర్ణయిస్తారు.  తాము ఎదుటివారికి కనబడకుండా మసలడానికి కావలసిన మెలకువలూ, అన్వేషణకుకావలసిన పట్టుదల నేర్పుతుంది ఈ ఆట.
                             టెం క లా ట
   ఇద్దరుగాని, ఇంకా ఎక్కువమందిగాని కలసిఉండే ఆటఇది. ఎవరి మట్టుకువారు మామిడిటెంకలు తెచ్చుకొని, చిన్నవలయంగా ఒక గిరిగీసి అందులో అందరూ సమానంగా ఇన్నేసిటెంకలని పెడతారు.  ఈ గుట్టపేరు "గుడి". దానికి దాదాపు 15 అడుగులదూరం లో అందరూ ఒకే వరుసలోనిలిచి ఒక్కక్కరూ ఒక్కొక్కటెంకను గుడిదగ్గరకు విసరాలి.  ఎవరిటెంక గుడికి ఎక్కువ దగ్గరపపడితే ఆ వ్యక్తి దానితో ఆ టెంకలగుట్టను కొడతాడు. ఆ కొట్టడంలో ఎన్ని టెంకలు బిరిదాటివస్తే అన్నీ అతనివే