పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/438

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకరివెనుకఒకరు పరిగెడుతూ, గంటఆగగానే లోపలిసున్నాలలో ఒక్కోదానిలో ఒక్కొక్కరు కూర్చోవాలి. ఇలాకొర్చోగానే ఒకరు మిగిలిపోతారు. అతన్ని ఆటనుంచి తప్పించి ఒకసున్న చెరిపేస్తారు. మళ్ళీమళ్లీ ఇలాగే ఆడిస్తూ, ఒక్కొక్కొసున్నా చెరిపేస్తూ ఒక్కొక్కరినీ తప్పిస్తుంటారు. ఇలాగచేస్తూపోగా చివరిక్ ఒక్కరుమాత్రం మిగులుతారు ఆంఅరుకుర్చీలో వారు పండినట్టు. కొర్చునే ఈసున్నలను కుర్చీలుగాభావిస్తూ దీనిని "కుర్చీలాట" అన్నారు. ఈఆటలలో మనసు త్వరగా నిర్ణయం తీసుకోవడం, కాళీకుర్చీలను ఒకకంటకనిపెట్టుకుంటూ పరుగుపెట్టడం ప్రాముఖ్యం వహిస్తాయి.

   ఇప్పుడు కుర్చీలాటంటే నిజమైన కుర్చీలాట. అంటే కుర్చీలు ఒకరి మీద ఒకరు విసురుకోవడం, పిల్లలు యిలా కుర్చీలతో కొట్టుకుంటుండడం చూసి ఒకతల్లి "అదేవిటర్రా" అలా కొట్టుకుంటారు! అని అదిలిస్తే ఇది 'అసెంబ్లీ ఆటమ్మా ' అన్నారట.
                     కొ క్కో
     ఒకచోట ఒకరాయిపెట్టి దానికి పది పదిహేను అడుగులదూరంలో మరొకరాయి పెడతారు.  పిల్లలు రెండుజట్లుగావిడి ఆ రాళ్ళమధ్య ఒక జట్టువారు ఒకరుముందుకీ, ఒకరువెనక్కీ చొప్పుబ దూరదూరంగాకూర్చుంటే రెండవజట్టువారు వీరికి మధ్యమధ్య అక్కడక్కడ నిలుచుంటారు.  మొదటి జట్టులో ఒకరు దొంగగా అటూయిటూ తిరుగుతూ నిలుచున్నవాళ్ళను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.  వాళ్ళు దొరక్కుండా ఆపెడకూ, ఈ పెడకూ తప్పుకుంటారు.  ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అవుటన్నమాట, ఆటనుంచి తప్పుకోవాలి.  దొంగ అలాతిరుగుతూ కూర్చున్న వారిలో ఎవరికైతే రెండవజట్టుమనిషి దగ్గరుందో ఆమెవీపు తట్టి "కొక్కో" అంటుంది. ఆ వ్యక్తిలేచి రెండవజట్టుమనిషినిముట్టుకుంటే ఆమె అవుటు.  ఆతరువాత ఈమెకూడా మొదటిదొంగలాగే తమజట్టులోని ఇతరులకు కొక్కో పెడుతుంది.  అందరూ అవుటయిపోయాక మరల రెండవజట్టు వారుకూర్చుంటే మొదటిజట్టు నిలబడి ఆడతారు.