పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/437

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోయిదాక్కుంటారు. తరువాత దొంగ వాళ్ళను వెతికి ముట్టుకోవాలి. అలా వెతుకుతుంటే దాక్కున్నవాళ్ళువచ్చి తల్లినిముట్టేసుకుంటారు. ఎవరయినా తల్లిని ముట్టుకొనేలోగా దొంగ ముట్టేసుకుంటే వాళ్ళు దొంగగామారతారు. లేకుంటే మొదటిదొంగకే మళ్ళీ కళ్ళుమూసి ఆడతారు. కొన్నిచోట్ల వాళ్ళ అసలుపేర్లుకాకుండా ముందుగానే చామంతి, బఠాణి, గులాబి అని మారుపేర్లు పెట్టుకుని ఆ పేర్లతో ఆడతారు. దొంగగుర్తుగా ఆపేర్లే చెప్పాలి.

     ఈ ఆట స్పర్శజ్ఞానాన్నీ, ధారణశక్తినీ కలుగజేస్తుంది.
  • ఈ ఆటను 'సునిమీలితము ' అని వాత్స్యాయనుడు పేర్కొన్నాడు.
                 పం ది ము రి గిం దాట
 పిల్లలు రెండు జట్లుగావిడి, ఒకజట్టువారు దూరంగావెళ్ళి చాటున కూర్చుంటారు. రెండవజట్టువారు తమలో ఒకరిని పడుకోబెట్టి కనిపించకుండా పైన దుప్పటికప్పేసి మిగిలినవారంతా దాక్కుంటారు.  అవతల జట్టువారు 'పంది మురిగిందా?' అంటే ముసుగులో మనిషి గొంతుమార్చి "మురిగింది" అంటుంది.  అప్పుడాజట్టువాళ్ళువచ్చిచూసి ముసుగులోని మనిషి ఎవరోచెప్పుకోవాలి. 'మురిగింది ' అనివచ్చిన స్వరాన్నిబట్టీ, మనిషిసైజునుంబట్టీ ఆజట్టంతా ఆలోచించుకొని ఫలానావ్యక్తి అంటారు.  అది సరిఅయితే ఆజట్టు నెగ్గినట్టు.  అప్పుడు రెండవజట్టు "ముసుగుపార్టీ"గా మారతారు.  స్వరానిబట్టిపోల్చడం, ముసుగుస్వరూపాన్నిబట్టి ఊహించడం అనేవి పిల్లలలో ఉత్సుకతను రేకెత్తించడమేకాక నిశితపరిశీలననూ, సమిష్ఠి బాధ్యతనూ అలవరుస్తాయి.
                     కు ర్చీ లా ట
        నీళ్ళతోగాని, ముగ్గుతోగాని ఒక పెద్దవలయంచుట్టి, ఆ వలయంలో ఆడేపిల్లలు ఎంతమందిఉన్నారో అంతకుఒకటి తక్కువగా సున్నలు (మనిషికూర్చొవడానికి సరిపడినంత) చుట్టి ఒకరు నిర్వాహకునిగా బయట నిలిచి గంటకొడుతుంటారు.  గంటకొట్టినంతసేపూ పిల్లలు వలయంచొట్టూ

  • వాత్స్యాయన కామ సూత్రములు 92-3-77)