పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/432

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వై కుం ఠ పా ళీ

    వ్యావహారికంలో దీన్ని గవ్వలాట అనడం కద్దు.  "పరమపదసోపానం" అనే ఒక అచ్చుకాబడిన చిత్రపటంలో ఒకచదరపుటంగుళం వైశాల్యంగల 122 గడులు 12 నిలువువరుసలు, 11 అడ్డుగరసలుగా ఉంటాయి.  ఒక్కొక్కగడిలోజంతువులు,  చేపలుజ్, పాములు, మనుషులు, రాక్షసులు, దేవతలు, ఋషులు, సప్తలోకాలు,  మనోవికారాల బొమ్మలు ముద్రించబడి ఉంటాయి.
     పాముల తలలు పైవరుసగడులలో ఉండి, తోకలు క్రిందివరసగడులలోకి ఉంటాయి.  నిచ్చెనలు క్రిందివరుసగడులలో ప్రారేంభమై చివరలు పైవరుస గదులలోకి వెళతాయి.  ఈ ఆట ఆడేవాళ్ళందరూ తలొకరాయి తమకు గుర్తుగా పెట్టుకుంటారు.  వీనినే "పావులు" అంటారు.  నాలుగు గవ్వలుతీసికొని చేతిలోగిలకరించి నేలమీదపోస్తారు.  అందులొ కొన్నిబోర్లాపడతాయి.  కొన్ని వెల్లకిలాపడతాయి. ఎని వెల్లకిలా పడతాయో అనిగడులు పతంలో ఒకటినుంచి లెక్కించి ఆ వేసినవారి 'పావు ' ను నడిపి ఆ గడిలోనుంచుతారు.  అలాండిసేటప్పుడు, అది నిచ్చెనగడిదగ్గరఆగితే ఆనిచ్చనకిపైగడిఎక్కడో అక్కదికి ఆ పావునుఎక్కించేస్తారు.  అది పాముతలదగ్గరఆగితే ఆ పాముతోక చివరిగడిదాకా క్రిందికి దించేస్తారు. ఇలా 132 గడులూదాటాక చివరివరుస బొమ్మలలో మధ్యనున్న శ్రీ మహావిష్ణువు బొమ్మమీద నిలుపుదల ఎవ్ఫరికైతే దొరుకుతుందో వారు పండిపోయినట్టు.
 ఈ గవ్వలు గిలకరించి పొయ్యడంలో ఒక్క గవ్వ తిరగబడితే "కన్ను", రెండుపడితే 'ధ్వయం ', నాలుగుపడితే "చెమ్మ" అంటారు.  ఒక్కోసారి నాలుగుగవ్వలూ బోర్లాపడతాయి - దానిని "అష్ట" అంటారు.  అంటే ఎనిమిది. ఇలా 'అష్ట ' పడినా, "చెమ్మ" పడినా ఆ వ్యక్తి మరొకసారి గవ్వలు పోసుకోవచ్చును.  ఇందులో పాములు మ్రింగడాలూ, నిచ్చెనలెక్కడాలూ చిత్ర విచిత్రంగా ఉంటాయి.  జీవితంలోవలెనే ఈ ఆటలో ఏదీ అనుకున్నట్లు నడవక ప్రతినిమిషం సంభ్రమాశ్చర్యాలు కలుగుతుంటాయి.  ఇది పూర్తిగా వినోద ప్రధానం.  నవ్వుల పువ్వుల హరివిల్లు.