పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/431

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎదుటివారికి తక్కెడకాకుండాదూసుకుంటూ తనకు తక్కిడయ్యేటట్లు ఒక్కొక్క గింజామూలల్లో పెడుతుంటారు. ఏగీతమీదయినా ఒకేరకంగింజలు మూడు వరుసగావస్తే తక్కెడ అయినట్టు. అప్పుడు గీతలోపెట్టబడ్డ ఎదుటివారి గింజనొకదానిని తీసేసుముంటారు. అలాపెట్టడంలో ఏగీతమీదా తక్కెడరాకుంటే అవి ఒకరితరువాతఒకరు తమగింజలు ముందుకీ, వెనక్కీ, పైకీ, క్రిందకీ కాళీలలోనికి జరుపుతూ ఆడతారు. ఈ జరపడంలోకూడా తక్కెడకవచ్చు, కొన్ని ప్రదేశాలలో దీన్ని "నాడాట" అంటారు. ఇది మేధాశక్తిని పెంపొందించే ఆట.

                           పు లి - మే క
      దీనికికూడ నేలమీద సుద్దతోగాని మసిబొగ్గుతోగాని ఒక సున్న చుట్టి, దానికి దిగువన ఒకచదరంగీసి, ఆ చదరంలో మధ్యగా ఒక అడ్డుగీతగీసి, సున్నానుండి ఏటవాలుగా మూడుగీతలు ఆ చదరంగుండా క్రిందికిగీసి, ఆమూడిటినీ క్రింద మరొకగీతతో కలుపుతారు.  మూడు పెద్దరాళ్ళు పులులు - పదిహేను చిన్న రాళ్ళు మేకలు.  ఒకర్ పులిరాళ్ళు రెండవారు మేకలరాళ్ళు గీతల మూలలలోకూ, గీతలు కలిసినచోటా పెడుతూ, జరుపుతూ ఆడతారు.  అక్కడైనా ఒకమేకవుండి దానిక్రిందగాని, ప్రక్కనగాని, పైనగాని పులివుండి. ఆ వరుసలో మేకప్రక్కగడికాళీగాఉంటే పులి ఆ మేకను మ్రింగేసి ఆకాళీగడిలోకి జరుగుతుంది.  పులిఉన్నచోటునుంచి ఎటుచూసినా వరుస రెండుచోట్లా మేకలుండి కట్టేస్తే పులిఆట కట్టే.  'బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కి చావదె సుమతీ".

దీనిని గూర్చి ద్రాత్రింశతికారుడుకూడా ప్రస్తావించియున్నాడు.

          * "తగులు విరివి యైన కడుమె
               చ్చుగ నాడుదు పులులయాట, జూదంబులలో
               మిగలక నేర్పరి బాగిడి
               తిరుటస్ సాగబాల నేనతి ప్యౌధుండన్"


  • సింహాసన ద్వాత్రింశక. కొరవి గోపరాజు