పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/433

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డా.యస్. వి. జోగారావుగారు "పరమపదసోపానపటం" ఖండికలో పెద్దపాము మ్రింగడాన్నిగురించి యిలావ్రాశారు మనిషిగతాన్ని జ్ఞాపకం చేస్తూ -

                  * "మన పునర్జన్మాధికారం
                      మానవ ప్రధమావతారం" అన్మి
అవుతుంది. పెద్దపామునోట్లోపడితే క్రిందికి మొదటిగడిలోకొస్తాం. ఆ
గడిలో ఉన్న బొమ్మ కోతి. మానవుడిప్రధమావతారం కోతేగా !

                వా మ న గుం ట లా ట
      నేలమీద వరుసగా ఏడుచిన్నగుంటలుపెట్టి, వానికిదిగువగా అదే విధంగా మరోఏడుగుంటలు పెడతారు.  కొందరు నేలకుందులు చిన్న బల్ల చెక్కమీద యిలా గుంటలు ఏర్పాటుచేసుకుంటారు.  ఒక్కొక్కగుంటలో పదమూడురాళ్ళు పోస్తారు.  ఆట ఆడేయిద్దరిలో ఒకరివి పైవరసగుంటలు, రెండవవారివి క్రిందవరుస గుంటలు.  మొదటివారు పైవరుసలోగల ఒక గుంటలోనిరాళ్ళు తీసుకొని అక్కడనుండొ వరిసగా మిగిలినగుంటలలో ఒక్కొటిచొప్పున వేసుముంటూవెళ్ళి అవిపూర్తయిన పిమ్మట ఆ ప్రక్కనే పైనా, క్రిందాగల రెండుగుంతలలోనిరాళ్ళూ తీసుకుంటారు. అనంతరం రెండవవరు క్రిందవరుసనుంది ఏదోఒకగుంటలోని రాళ్ళు తీసుకొని మొదటివారిలాగే చేస్తారు.  రాళ్ళుతీసికొనేటప్పుడు గతంలోకాళీ కాబడ్డగుంటల్లో తనువేసినరాయితో కలిపి నాలుగురాళ్ళు అయితే ఆ నాలుగు రాళ్ళుకూడా తీసేసుకోవచ్చు.  ఈ నాలుగుని "ఆవు" అంటారు.
                ఈవిధంగా ఆడగాఆడగా చివరికి ఎవరికి ఎక్కువరాళ్ళువస్తాయో వారు గెలిచినట్టు.  ఇది సమయస్పూర్తికి సంబందించిన ఆట  ఏ గుంటలోవి తీసుకొనిపంచితే  ఎక్కువలాభంవస్తుందో సెకండ్లమీదఆలోచించిఆడటం గెలుపునకు కీలకం.  ప్రత్యేకించి దీన్ని బ్రాహ్మణస్త్రీలు యింటింటా విశేషంగా ఆడేవారు.  సీతమ్మవారుకూడా యీ వామనగుంటలాట ఆడిందని మన జానపదరామాయణాల్లో ఉంది.

                        *పంచకళ్యాణి. పు.86