పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మినుములూ, పెసలూ చేంగినూ, కందిచేను గట్లమీదాపెంచి మినప్పప్పుతో మినపరొట్టే, పెసలతో పెసరపప్పు, కందులతో కందిపప్పు వండుకుతింటారు. అంటే వారికి కావలసిన ఆహారం వారిచేతిలో ఉన్నట్టే. కొందరు ఉదయం చోడిఅంబలిలో మజ్జిగ, ఉప్పు కలుపుకు త్రాగురారు. ఇదివారి ఉదయం టిఫిన్ అన్నమాట. చాలామంది చద్ధన్నం తింటారు. సాయంత్రం ఉప్పుకలిపిన ఉడుకుగంజి త్రాగుతారు. ఇది వారి సాయంత్రం కాఫీ. ఇవి చవకగా లభ్యంకావడమే కాకుండా దేహానికి తుతుష్టినీ పుష్టినీ కలిగించే బలిష్ఠమైన ఆహారం. వీనిలో విటమునుల విలువ ఎక్కువ. అందుకే వరిలో నగరజీవులలాగ్ఫ నరాల బలహీనతలు, రక్తహీనతలు తక్కువ. వారు పండింఛే పంటకు ఎరువు వారి యింటి పెంటే. *"కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, కాదేదీ కవితానర్హం" అన్నట్లు వీరికి పనికిరాని వస్తువులేదు.పైగా ఈ పెంటతో పెంచబడ్డ పంట ఆరోగ్యానికి మంచిదంట. వీరు పంటకు కాల్చిన మట్టి కుండలువాడతారు. ఇది ఖరీదు తక్కువేకాకుండా యితర పాత్రలలోలాగ వేడి తగిలినప్పుడు వంటపదార్ధంలో మరో రసాయనిక సంయోగం జరుగదు. అందువల్ల ఆరోగ్యానికేహానీ ఉండదు. వంటకే కాకుండా నీళ్ళు తెచ్చుకోవడానికీ చల్లకూ మట్టికడవలనే వాడుతారు. ఖరీదైన పాత్రలుకాదు గనుక దొంగతనాల బెడద ఉండ్దు. వేదంలోకూడా "మృణ్మయం దేవపాత్రం" అనివుంది. 'నాధుడు పల్లియకేగి భుజింపకున్కి భరితంబయి అట్టుకనట్టునట్టి యొప్పనో దనంబొసగె తదాజ్ఞానం శ్రావమూకుటన్" (పాండురంగమహత్యం) అటకలోని అన్నంను మట్టిమూకిట (చిప్పలో) తెచ్చి వడ్డించెనని అర్ధం. ఈ మట్టికుండల వినియోగం అంతపురాతనమైనది. జానపదులలో పాడి సమృద్ధి - ఇంటికొచ్చిన అతిధికి మజ్జిగ దాహం యిచ్చి మర్యాదచేస్తారు. వ్యవసాయానికి ఎద్దులూ పోతులూ పాడికి ఆవులూ గేదెలూ వారి జీవిత భాగస్వాములు. కాఫీ, టీల కంటే మజ్జిగ సేవనం మనిషికి ఆరోగ్యం.

ఇక కావలసిన కూరా నారా యింటి పెరట్లోనే పండించుకుంటారు. ఈ జానపదుల పెరటితోట నిజానికి ఆరోగ్య ఐశ్వర్యాల మూట.


                       *మహా ప్రస్థానం - శ్రీ శ్రీ