పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తగువెడుతుంది. దాన్ని రెండుగుంజీలు తియ్యమనో, మూడుగుంజీలు తియ్యమనో శిక్షించి పరిష్కరిస్తారు. దీనివల్ల తగువు, పరిష్కారం, శిక్ష అనేవి బాల్యంనుండీ అవగాహనలోకి వస్తాయి.

                               గు డు గు డు గుం చం
   పిల్లలు ఇద్దరు ముగ్గురుచేరి పిడికుళ్ళుముడిచి, ఒకరిపిడికిలిపైమరొకరి పిడికిలి పెట్టి, పైపిడికిలి మధ్యకాళీలో ఒకరు చూపుడువేలు పెట్టి త్రిప్పుతూ "గుడు గుడు గుంచం, గుండారాగం, పాములపట్నం, పడగారాగంణ్, కత్తెయ్యనా?

బద్దెయ్యనా? చన్నీళ్ళెయ్యనా?" అని పాడుతూ వేణ్ణీలన్నవారి పిడికిలి గట్టిగానూ, చన్నీళ్ళన్న వారిపిడికిలిచిన్నగానూగుచ్చుతూ అన్నిపిడికళ్ళనూ, అలాగే పూర్తి చేస్తార్. ఇందులో వేళ్ళు తిప్పేటప్పుడూలిగే గిలిగింత ఆ పశిహృదయాలలో చక్కిలిగింతలు పేడుతుంది.

   ఇలా గిచ్చినప్పుడు ఆపిల్లలు తమచేతులు వెనక్కీపెట్టేసుకుంటారు. అప్పుడు చేతులు గిల్లినపిల్ల చేతులువెనక్కిపెట్టుకున్న పిల్లల్ని ప్రశ్నరూపంలో అడుగుతుంటే ఆపిల్లలు వానికి సమాధానముచెబుతూ తీగలాగసాగిస్తారు.  ఇద్ చిత్రమైన మాటల ఆట -

                     "పిల్లీ నీ చేతులేవి?
                      పిల్లెత్తు పోయింది
                      ఎక్కడదాకా ఎత్తుకుపోయింది ?
                     గోలుకొందదాకా.
                     గోలుకొండేమిచ్చింది ?
                     గుడ్డిగవ్వ.
                     గుడ్డిగవ్వేంచేశావు ?
                     కుమ్మరికిచ్చాను
                     కుమ్మరేమిచ్చాడు ?
                     కుండ.
                     కుండనేంచేశావు ?
                    మాతాతకిచ్చేను
                    మీ తాతేంచేశాడు?