పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/420

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"పెద్దపులొస్తేజడవ్వుగదా?" అని అడుగుతారు.
"జడవను" అనిఅనగానే 'ఉష్ ' అని కళ్ళల్లోకి ఊదుతారు-

    అలాఊదినప్పుడు కనురెప్పలు సహజంగా మూసుకుంటాయి గదా: అలా ముయ్యగానే 'మరి జడిశావేం?' అని ఓడినట్లు చప్పట్లు కొడతారు ఆడినవాళ్ళు. ఆతరువార మళ్ళా అలాగ మొదటప్రశ్నించిన వారిని రెండవవారు ప్రశ్నిస్తారు.  ఇలా ఆ పసిపిల్లలు ధైర్యాన్ని పరీక్షించుకుంటూ ఆడుకునే ఆనందవల్లరి యిది. అల ఊదడం క్జళ్ళకు చల్లనిగాలి తగులుతుందేమో హాయిగా ఉంటుంది. కళ్ళల్లో ఏదౌయినా బూటిదలాంటిది పడితే పోతుంది.
                                 అప్పుడప్పుడుతాండ్ర
    నలుగురైదుగురుపిల్లలు వరుసగా గుండ్రంగా కూర్చుని ప్రతివారూ తమ రెండు అరచేతుల్నీ తిరగేసి ఒక దానిమీదఒకటి పెడతారు.  కూర్చున్న క్రమంలోవారు ఒకరిచేతులమీదఒకరు పెడతారు.  అన్నిటికన్నా పైన ఉన్నవారు (వీళ్ళే సాధారణంగా ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళయిఉంటారు. లేదా మాట చలామణిగలవారు అయ్యుంటారు) పైనున్న తనచేయితీసి ఆ క్రిందనున్న చేతులమీద ఒక్కొక్కదానిమీదా చేతితో అప్పడంలా చిన్నగా వాయిస్తూ ఈ క్రించి రీతి పాడతారు. -

                  "అప్పడప్పడ తాండ్ర
                   ఆవకాయ తాండ్ర
                   మావాళ్ళ దొడ్దిలో
                   మామిడికాయ తాండ్ర
                   చిలకముక్కు
                   చెవు పట్టుకో"

అని పాట ముగియగానే ఆతట్టబడ్డ చెయ్యివారు ఆచేతితో ప్రక్కవారిచెవి పట్టుకుంటారు. ఇలాగ అనేకసార్లుపాడి ప్రతివారూ ప్రక్కవారిచెవిపట్టుకునె దాకా పాడతారు. ఆ తరువాత అలా చెవులుపట్టుకుని జోజో అంటూ అందరూ తూగుతూ ఊగుతూ ఆనంద తీరాల తేలిపొతారు. కొంతమంది కొంటెపిల్లలు పట్తుకున్నచెవులు చిలిపిగా గిల్లుతారుకూడా. గిల్లబడ్డ పిల్ల