పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/422

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముడ్డికడుక్కొబోయి నూతిలో పడేశాడు.
నుయ్యేమిచ్చింది?
నీళ్ళు,
నీళ్ళేంఛేశావు?
మొక్కలకిపోశాను.
మొక్కలేమిచ్చాయి?
పువ్వులు.
పువ్వులేంచేశావు ?
 మాయప్పకొప్పులో పెట్టేను,
కొప్పేమిచ్చింది?
పేను.
పేనేం ఛేసావు?
గడపమీదేసి కుక్కేను.
గడపేమిచ్చింది?
చెక్క.
చెక్కేం చేశావు?
పొయ్యిలో పెట్టాను.
పొయ్యేమిచ్చింది?
బూడిద.
బూడిదేం చేశావు?
పెంటమీదేశాను.
పెంటేమిచ్చింది?
ఎరువు.
ఎరువువేంచేశావు?
చేనుకేశాను.
చేనేమిచ్చింది ?
పచ్చగడ్డి.
గడ్డేం చేశావు?
ఆవుకేశాను,
ఆవేమిచ్చింది?
పాలు
పాలేంచేశావు?