పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6. వై.బి. అన్నపూర్ణగారు:-

 కాకినాడ.  ఈమె అమ్మాజీబాయిగారికుమార్తె.  హరిశ్చంద్రలో చంద్రమతి వేషం చక్కగాచేస్తూ తల్లిని మరిపిస్తుంది.  చింతామణిలో రాధవేషంఅ, తులాబారంలో సత్యభామవేషాలుకూడా ధరిస్తూ పద్యం పాడడంలో తారస్థాయినికూడా అధిగమించి పేరుతెచ్చున్ననటి.

7. నా గ మ ణి గారు:-

 పసలపూడి. కురుక్షేత్రంలో కృష్ణుడు వేషంవేసి "బావాఅప్పుడువచ్చితీవు" వంటి పద్యాలుపాడుతుంటే ఆగంబీరమృదుమధురస్వరానికి అందరూ ముగ్దులుకావలసిందే.  సాయిబురెడ్డిగారి  దళంలోచేరి ఆదిపరాశక్తి ప్రదర్శనలు దేశంలో వేలమీదయిచ్చి పేరుగడించిన గొప్ప నటి.. బాలనాగమ్మలో బాలనాగమ్మవేషంకూడా సమర్దవంతంగా పోషించేది.

8. శేషుకుమారిగారు:-

 రాజమండ్రి. బాలనాగమ్మలో యీమెసంగువేషం నవరసభరితం.  వయ్యారలొకకించడంలోనూ. తియ్యగాపాడడంలోనూ యీవేషానికి యీమెకు పొటీలేదనిపించేది.  కొన్నినాటకాలలో నారదుడువంటి మగ పాత్రలుకూడావేసి సెహభాష్ అనిపించుకున్ననటి.

9. సుభాషిణిగారు:-

  భీమవరం.  నిండైనవిగ్రహం నీనులవిందైనగాత్రం. చింతామణి వేషంలోఆధునికంగా ఆమెపద్యాలు, నటన, ఆమేందంతొ పందెంవేస్తాయి. ఈమె స్టేజిమీదకురాగానే అందరూ అదిగో వాణిశ్రీ ఆంటుటారు.

10-. సి.హెచ్. రాజేశ్వరిగారు:-

కాకినాడ. రేడియోరికార్దిస్టు. చింతామణిలో రాధవేషం యీమె సొత్తు. మృదువైనకంఠం. వింటుంటే ప్రేక్షకులకు ఏదోదేవగానం వినిపిస్తున్నట్టుంటుంది. ఆమధురాగత్రం రంగస్థలంమీద ఆమెకు పెద్దఆస్థి. చింతామణిలో చింతామణిగానూ విరివిగా ప్రద్రర్శనలుచేస్తున్న వర్ధమాన నటీమణి.