పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/403

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11. కుమారి రాఘవ:-

  కాకినాడ. హరిశ్చంద్రలో కలకంఠి. చింతామణిలో శ్రీహరి పాత్రలకు తనకు సాటిలేరనిపించుకునేది.  4 దశాభ్దాలుగా వారికి కళారాధననేపరమావధిగా ఎంచుకున్న నటీమణి.

12. టేకి అనసూయగారు:-

   ఏలూరు. సక్కుబాయిలో సక్కుబాయి, హరిశ్చంద్రలో చంద్రమతి, చింతామణిలో చింతామణి తులాభరంలో నారదుడు వేషాలు వేసేది.  ముఖ్యంగా తులాభరంలో నారదుడుగా తరంగాలు, కీర్తనలు మధురంగాపాడి ప్రేక్షకులను మైమరపించేది.

13. శ్రీమతి ఆవేటి పూర్ణిమగారు.

    ఏలూరు.  సురభినాటకరంగసభ్యురాలు.  వనారస గొవిందరావుగారి అమ్మాయి.  చిత్రాంగి, చింతామణి, సుభద్ర, ద్రౌపది, సత్యభామ, బాలనాగమ్మ, రాధ, మల్లమదేవి యీమెప్రసిద్ధిగావేసిన వేషాలు.  గుర్తింపుతెచ్చుకున్న కళాకారిణి.  మధురమైన కంఠస్వరం, మంచినటన ఆమెప్రత్యేకత.

14. శ్రీమతి శ్యామలగారు.

నిడదవోలు:- సైరంధ్రి చంద్రమతి, మండోదరి పాత్రలు మనోహరంగా నటించి ప్రేక్షకులహృదయాలలో చెరగనిముద్రవేసుకున్న నటీమణి.

15. శ్రీమతి కోడూరి లక్ష్మీకాతంగారు

    తాడేపల్లిగూడెం. రౌడీలో అన్నపూర్ణ, హరిశ్చంద్రలో చంద్రమతి, సక్కుబాయి, బాలనాగమ్మ, శాంతిమతి పాత్రలు వందలసంఖ్యలో నటించిన నటీమణి.

16. శ్రీమతి సురభి భారతిగారు

   తాడేపల్లిగూడెం.  సుభద్ర, చంద్రమతి, రాధ, సత్యభామ, మల్లమదేవి కైకపాత్రలు చక్కగాపోషించి పేరొందిన నటి