పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/401

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2.మాణిక్యకుమారిగారు:-

   రాజమండ్రి. చింతామణినాటకంలో చింతామణీగా ఎంతోమోహనంగానటిచి పేరుగడించిన నటి.  శృంగారాభినయం యీమెసొత్తు.  చివర సన్యాసిగామారిన వేషంలో కాషాయబట్టలతోవచ్చి బిల్వమంగళుని "ఏమిచూసి నను మోహిస్తివీ దేహమేలాంటిదని ఆలోచిస్తివీ" అని పాడుతుంటే ప్రేక్షకులమనస్సుల్లోకికూడా ఆవేదాంతభావం దూసుకుపోయి ఓహ్ ఓహ్ అని మళ్ళీమళ్ళీ పాడించుకునేవారు.

3. ఆర్. క్జోటీశ్వరిగారు:-

    ఏలూరు.  మల్లాదివారిపేదపిల్ల నాటకంలో పేదపిల్లగా భారతదేశమంత అన్ని రాష్ట్రాలలోవేయిపైనే ప్రదర్శనలిచ్చిన మహానటి.  హరిశ్చంద్రలో యీమె చంద్రమతిపాత్ర నిర్ఫహణ అమోఘం. ముఖ్యంగా కాటిసీనులో లోహితుణ్ణి  పడుకోబెట్టి, పైన పిడకలుపేర్చి కన్నీళ్ళు కార్చేసేవారు.  ఆసీనంతా ప్రేక్షకులు జేబురుమాళ్ళతో కళ్ళద్ధుకుంటూ ఉండేవారు.  నటన, పద్యపఠన ప్రేక్షకులహృదయాన్ని దోచుకుంటాయి సమయస్పూర్తి గల నటి.

4. రెడ్డి రత్నంగారు:-

     కాకినాడ. స్ఫురద్రూపి, మధురగానం. చింతామణి నాటకంలో చింతామణివేషానికి చాలప్రసిద్ధి.  ఆట, మాట, పాట సమపాళ్ళలో రంగరించి ప్రదర్శించేనటి.  గాత్రం, రూపం యీమెకు పెట్టనిసొమ్ములు.  "తనకుగల్గినదెల్ల ధారబోసినయాట్టి" అనెపద్యం తప్పకుండా వన్సుమోర్లు తీసికొనేది.  "మందారగంధమిదే" అనేపాటతో సుబ్బిశేట్టిని ఆటపట్టించే సన్నివేశంలో ఈమనటన నాటకరంగంలో మైలురాయి.

5. ర జ నీ కాం తం గా రు:-

       కాకినాడ.  చింతామణిలో రాధపాత్ర మకుటాయమానముగా నటించేది.  "నచ్చుటే కష్ఠమావనితను విడనాడి" అనే పద్యం మాండురాగంలో పాడుతూ కంటనీరుపెడుతుంటే ప్రేక్షకహృదయం తరుక్కుపోయేది.  కరుణ రసపోషణలో దిట్ట.