పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/400

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49. వి. వెంకట్రాజుగారు.

   ఏర్రంపేట (కొయ్యలగూడేంమండలం) పాపారాయుడు, దుర్యోధనుడు, యయాతి,గయుడు, కౄరసేనుడు, కంసుడు మొదలగు ఎన్నోపాత్రలు చక్కగాపోషించినదిట్ట.

50. బండారు వెంకటేశ్వర్లుగారు.

  తాడేపల్లిగూడెం.  స్త్రీపాత్రలుమాత్రంమే పోసించేవారు.  చంద్రమతి, రాధ, బాలనాగమ్మ, రుక్మిణి, ద్రౌపది పాత్రలు నిజంగా స్త్రీ లాగే నటించి ప్రేక్షహృదయాలను దోచుకున్ననటుడు.  తొరారాంలో జిజయాబాయి, రామదారులో కమల, వెంకటేశ్వరమాహాత్మ్యంలో వకుళ పాత్రలుకూడా అతనికి పేరుతెచ్చాయి.

51. ముంజులూరి కృష్ణారావుగారు.

    ఏలూరు. కళాప్రపూర్ణబిరుదాంకితులు. ప్రతాపరుద్రీయంలో యుగంధరపాత్రతొ అఖండ యశస్సు ఆర్జించారు.  ఆరోజుల్లో ఉద్యోగ విజయాల్లో కృష్ణపాత్రకు ఆయనదేపేరు.

52. మజ్జి రామారవుగారు.

  ఏలూరు. 12ఎటనే భక్తనందనారీ పాత్రనటించి అనెకబహుమతులుపొందారు.  కృష్ణ, సారంగధర, భిళ్వమంగళ, భవానీపాత్రలు "నటరత్న" కూడా పోషించి "రంగస్థలరవ్వ" బిరుదులు పొందారు.
                      న టీ మ ణు లు

1. అమ్మాణీబాయిగారు:-

  మండపేటవాస్తవ్యులు.  భద్రాచారిగారితో కలిసి హరిశ్చంద్రలో చంద్రమతివేషం వేసేవారు.  వీరినాటకాలలో ప్రముఖసినీనటులు అక్కినేని నాగేశ్వరరావుగారు స్త్ర్రీవేషం వేసేవారు.  ఈమెచంద్రమతిగా పిడకలసీనులోనూ, కాటిసీసులోనూ చేసేనటనకు కంటతడిపెట్టని ప్రేక్షకుడుండేవాడుకాదట. తానులీనమై నటిస్తూ ప్రేక్షకుల్నికూడా లీనంచేసేదేట.  అలాగే కుచేలలో వామాక్షిపాత్రకూడా.