పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/392

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చివరి సీనులో పశ్చాత్తపంతో కళ్ళుపీకేసుముంటూ చేసేనటనకు అందరూ జోహార్లు అర్పించవలసిందే. ఉత్తమనటుడుగా రాష్ట్రమంతా అవార్డులు పొందారు.

5. గండికోట జోగినాధంగారు.

   వీరిది కాకినాడ. 5దశాబ్ధాలు ఆంధ్రనాటకరంగాన్ని ఏలిన సాటిలెని మేటి హాస్యనటులు.  చింతామణిలో సుబ్బిశెట్టిపాత్రకు వీరికి వీరే సాటి. దేశంలోఎన్నో ప్రదర్శనలిచ్చి హాస్యనటశేఖర, హాస్యనటకాగ్రణీ, హాస్యనటకావతంస. హాస్యకళానిధి, హాస్యరసచక్రవర్తి బిరుదులు పొందారు.  మంచి సమస్పూర్తిగల నటులు.

6. షణ్ముఖి ఆంజనేయరాజుగారు.

    వీరివాసం తణుకు.  కురుక్షేత్రంలో కృష్ణుడు పాత్రకు తిరుగులేనిపేరు.  రాయబారంసీనులో "చెల్లియో చెల్లకో" పద్యాలుపాడుతుంటే అన్నీ వన్సు మోర్ లే. రాగాలపనలో ఒక క్రొత్తవరవడి సృష్టించారు.  వీరు చింతామణిలో బిల్వమంగళుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, రామాంజనేయ యుద్ధంలో రాముడు వేషాలుకూడా వేస్తూ యావదాంద్రదేశంలో ప్రఖ్యాతి పొందారు.  వీరిబిరుదు 'ఆంధ్రగందర్వ '.

7. యస్. వి. యల్. నరసింహాచారిగారు.

   వీరిది కోరుకొండ. కురుక్షేత్రంలో దుర్యోధనుడు వేషం వీరిది చూసి తీరవలసిందే  ప్రత్యేకించి మయసభసీనులో నటన, వాచకం అద్భుతం ఈ సీను చూడడానికి దూరాబారాలుకూడా లెక్కచేయకుండా జనం తండోపతండాలుగా వచ్చేవారు.

8.కె. ఆర్. రెడ్దినాయుడుగారు.

  రామచంద్రాపురంవాస్తవ్యులు.  హరిశ్ఫంద్రలో వీరబాహుడుగా వీరినటన అమోఘం.  పాత్రచిన్నదయినా ప్రేక్షకహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నటించేవారు.  ముఖ్య్హంగా హరిశ్చంద్రునికి కర్ర, కుండ చేతికిచ్చి పంపించి తన అకృత్యామొలొ చింతిస్తూ చేసే నటన నాటకానికి వన్నె తెచ్చేది.