పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాఖ్య్హానాలతోపాటు కురుక్షేత్రం (పాండవోద్యోగ విజయాలు), బొబ్బిలి యుద్ధం, రంగూన్ రౌడీ, రామాంజనేయహుద్ధంకూడా యిక్కడి జానపదులను విశేషంగా ఆకర్షించిన నాటకాలు. ఈ నాటకాలలో తమ మహోన్నత నటనతో కీర్తిగన్న గోదవరిసీమ నటరత్నాలు ఎన్నో!

1`. వై.భద్రాచారిగారు.

   మందపేటలో మకాంఉండెవారు.  హరిశ్చంద్రుడువేషానికి యీ యనపేరు జగద్వితం.  కాటిసీనులో జనం ఘొల్లునఏడ్ఛేసేవారట.  అంతరసస్పూర్తి కలిగించేవారన్నమాట నటనతో.  పైగా తన కంచు గాత్రంతో పద్యంపాడుతుంటే ప్రేక్షములు పరవశించిపోయేవారు.  కుచేల వేషంకూడా అంతగొప్పగానూ ఉండేదట.

2. దొమ్మేటి సూర్యనారాయణగారు.

     వీరిది కోనసీమ. రంగూన్ రౌడీలో రౌడీవేషానికి ఆదిపురుషుడీయనే.  క్రూరత్వంచూపించడంలోనూ, భీభత్సరసాన్ని పొషించడంలోనూ అందెవేసినచెయ్యి.  ఆయననటన పరాకాష్ఠకు చేరుకుని పండితపామరులందరి చేతా చాలెంజిరౌడీఅని పిలిపించుకున్న మహానటుడు.

3. బేతా వెంకట్రావుగారు.

  వీరిది రాజమండ్రిదగ్గర గండేపల్లి.  రామాంజనేయయుద్ధం నాటకంలో ఆంజనేయపాత్రకు వీరు పెట్టిందిపేరు.  కుప్పిగంతులు, చిలిపి చేష్టలు, కోతికూతల రాగాలతో ఆనాటకానికే వన్నెతెచ్చాడు.  "హాలు నిండినవెనుక ఆయాతరగతులగట్లపై కూర్చుండవలెను" అనే ప్రకటన వీరినాటకానికే ఎక్కువ వర్తించేది. అంత మనోజ్ఞంగా నటించేవారు.  ఆంజనెయస్వామి ప్రత్యక్షంఅయినట్లె ఉండేది.  వీరు నాటకంలో ఒకనాడు స్టేజిమీద ఆంజనేయుడుగా రామారామాఅంటూ ప్రాణాలు విడిచారు.

4. బందా కనకలింగేశ్వరరావుగారు.

   వీనిది ఏలూరు. వృత్తిరీత్యాన్యాయవాది.  ప్రవృత్తిరీత్యా కళాకాధకులు.  కురుక్షేత్రంలో కృష్ణుడు వేషానికి రంగస్థలంలో బందాగారిది ఒక పంధా.  రాగం అంతంతమాత్రంగాతీస్తూ భావానికీ, భాషకీ అధిక ప్ర్రాముఖ్యమిచ్చి పద్యం పాడేవారట.  చింతామణిలొ బిల్వమంగళుడుగా