పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9. కొవ్వాడ సూర్యనారాయణగారు.

     కాకినాడ. రంగూన్ రౌడీలో రౌడీవేషంతో దేశమంతా ఒకవెలుగు వెలిగారు.  సిగరెట్ పొగ త్రాగడం, బ్రాందిత్రాగినట్టు నిషాగా మాట్లాడడంలో ఒక ప్రత్యేకకతతో ప్రేక్షములదృష్టినాకర్చించి చక్కని నటన చూపి మెప్పించారు.  వీడేరౌడీ, కొవ్వడ రౌడీ, చాలెంజిరౌడీ అని స్టేజిమెద తొడగొట్టి సవాలు చేసేవాడు.

10. దొమ్మేటి సత్యనారాయణగారు.

    రాజమండ్రిమకాం.  రంగూన్ రౌడీలో రౌడీవెషం, చింతామణీలో బిల్వమంగళ వేషం వీరికి ప్రసిద్ది.  గాత్రం మెటాలిక్ బోన్.  చాలా శ్రావ్యంగానూ, గంభీరంగానూ ఉండేది.  వీరుకూడా రౌడీవెషంలో దొమ్మేటిరౌడీ., చాలెంజీరౌడీ అని ముందు కరపత్రాలలోనే చాలెంజి విసిరేవారు.

11. యం.జి. ఆచారిగారు.

    వీరిది అన్నవరం.  హరిశ్ఫంద్రలో నక్షత్రకవేషానికి గొప్పపేరు. పాటలోనూ, మాటలోనూ, నటనలోనూ,వేషధారణలోనూ తనదయిన ఒకబాణీనిప్రదర్శించి ప్రజాహృదయాలలో మిగిలిపోయిన నటుడు.

12. కచ్చెర్లకోట సత్యనారాయణగారు.

    ఏలూరు.  మధురగాత్రం. వినేకొద్దీ వినాలనిపించే ఆలాపన వీరి పాత్రలకుజీవం.  కురుక్షేత్రంలో అర్జునుడుగానూ గయోపాఖ్యానంలో కృష్ణుడుగానూ, చింతామణిలో భవానీశంకరంగానూ దేశప్రఖ్యాతి పొందిన నటులు.

13. మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు.

      కాకినాడ. హరిశ్చంద్రపాత్రకు ఆంధ్రదేశంలో ఎంతోకీర్తిపొందిన వ్యక్తి.  రాగంలో, పాటలో, మాటలో, ఆహార్యంలో అన్నింటా రమణీయంగా పాత్రపోషించి తనకొక విశిష్టత నార్జిజ్ంచుకున్నారు.  వీరితో సుప్రసిద్ధరంగస్థలనటి పువ్వుల అనసూయ చంద్రమతిగా వేసేది.  వీరి ప్రదర్శన ఒక సుందర స్వప్నం.