పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"తలవనైతినినీకును నాకునుగలుగు తెలిమి తలవనైతిని చుట్టరికౌ
  ధర్మమైన, ఫాలనేత్రుని గెలిచిన బంటపగుట, తలచినాడవు
  కాబోలు దర్పమొకనె"

అనేదానిలో క్రోధం కనిపిస్తుంది. ఇది రౌద్రరసానికి స్థాయి. ఇక్కడి కృష్ణుడు అర్జునినితో తమ గతజన్మలోని నరనారాయణ వృత్తాంతము తెలుపుచూ "అందు నారాంశమున నీవును, నారాయణాంశమున నెనును పాండవ యాదవ వంశముల్ందు క్రమంబున నుదయించితిమి. నా వాక్యముల యదార్ధములెరుంగగోరెదవేని చూడు" అని కనులుతుడిచి ఆదృశ్యము అర్ఝునునిక్ జాపినపుడు అద్భుతరసం పోషింపబడింది.

   చివరకు నాటకం సుఖాంతమై పరమేశ్వరుని యీక్రింది ఆశీస్సుతో శాంతరసంలో పర్యవసిస్తుంది.

"పాడియు పంటయుం గలిగి భాగ్యముతో తలతూగు చుండి మా
  రేడులు నిన్ను గొల్చుచు మహీజనముల్ సుఖియింత్రుగాక"
భర్త్రకు సుభద్ర అన్ననుండి సందేశం తెచ్చినప్పుడు-
'ఆడుచున్న వాడె అభిమన్యుడలవోక తండ్రినెన్నడైన తలచు
నొక్కా ' అనే అర్జునుని కుశలప్రశ్నలలో వత్సలరసం ఉట్టిపడుతోంది.

యుద్ధఘట్టంలో కృష్ణుని కాళ్ళకు అర్జునుదు నమస్కరిస్తున్నప్పుడు కృష్ణుడు 'నీ ముఖదర్శనము పాతకహేతువు, నీవావలకు పొమ్ము ' అని తన్నగా అర్జునుడు 'గజ్జలందియలును ఘల్లుఘల్లని మ్రోయ నహిమౌళి తాండవం బాడేనెద్ది"?

'అట్టి నీపాద పంకజం బమల చరిత నాకఠిన దేహమునుదాకి నవసి
యుండు ' 'కావున నీచరణారవిందము నెనొత్తెదదేవా యిట
  తెమ్ము ' అనేచోట భక్తిరసం పొంగిపొరలుతోంది.

అంతేకాకుండా సంభాషణాచాతుర్యం యీనాటకానికిక్ జీవగర్ర, అందులో ముఖ్యంగా యుద్ధరంగంలో కృష్ణుడు ప్రయోగించిన సామదాన భేద దండోపాయములు, వానిని అర్ఝునుదు త్రిప్పికొట్టిన విధము మనోహరములు.