పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/388

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృష్ణు:- "అర్జునా! అనేకోపకారములొనర్చిన నన్నీసమయమందు
           నిరాకరించిన జనంబులు విన్నాచంద్రతారార్కము విశ్వాస
           ఘాతుకుడని నిందింతురు. కావున గయుని విడువుము."
అర్జు:- "గయున్ వర్జింతునేనిన్ జనుల్ హానివ్వచ్చుడధర్మచిత్తు
          డనరే ఆచంద్రతారార్కమున్".
          ఇది సామముతో సాధించపచేసిన ప్రయత్నానికి ప్రత్యుత్తరం.
కృష్ణు:- "అర్జునా! ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదమున కియ్య
          కొంటివేని నెకురానున్న లాభములు అనేకములు చెడిపోవును
          ఈ సమయంబున నన్ను మెప్పింతువేని ఈ ధరామండల
          మంతయు పట్టంబుగట్టేద"
అర్జు:- "మాధవా! మహేంద్రుసమానభోగికైనను శరణాగతసంర
          క్షణాది ధర్మకార్యాచరణమున కలిగినంతఆనందము సర్వం
          సహా పరిపాలన మొనర్పునపుడుకూడ కలుగదు. నామ
         నంబు ధర్పేతరివృత్తికొప్పదు బావా!"
         ఇది దానప్రయత్నమునకు ప్రత్యుతరం.
కృ:- "నీవును నేనును ప్రాణమిత్రులం, బంధువులము కదా!"
అర్జు:- "ఆమాటయం దబద్దమేమున్నది బావా!"
కృ:- "అట్టియెడ నాకపకార మొనర్చినదుర్మార్గుడు నీకుకూడ అప
         కారము చేసినట్లుకాదా!"
అర్ఝు:- "నీవానతిచ్చినది నిజమేకాని అధర్మమువలన నేను భయపడు
          చున్నాను."
          ఇది భేదోపాయమునకు ప్రత్యుత్తరము. ఇక దండోపాయము-
కృ:- "ఇదిగో - నాతోడ సురామర యక్షరాక్షస కిన్నర సిద్ధసాధ్య
         విద్యాధర గందర్వ గురుడులైన -సంగ్రామమున కియ్య
         కొనరు. నీవు బాలుడవు ప్రాణంబుండగా చూచుకొమ్ము."
అర్జు:- "ఫాలనేత్ర విజయములగు దారుణాస్త్రంబులు నాయొద్దను
         న్నవి. అతిడిచ్చిన పాశుపతాస్త్రమిదిగో."