పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/389

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృ:- "నిండు మగతనములేక సగమాడుదియగు మహేశ్వరుడు
       ప్రసాదించిన అస్త్రములా మమ్మునెఱపించునని"-
అర్జు:- 'రుద్రుడు ఎందుమగతనములేనివాడా ! తాను సగమాఏడు
         దియేయగునుగాని నీవు పూర్ణముగా ఆడుదానవగుదువు.
         నిరంతర నారీలోలుడవుకదా!"
కృ:- "ఓయీ మూర్ఖుడా! మృగములనుజంపు కిరాతునివిధమున విల్లు
         చేబూనినమాత్రమున ఎవరికి వెఱవు కలుగును?"
అర్జు:- "నే గిరాతుడనూ, నీవు గారడీ విద్యలవాడవు. అందుచేతనే
        గారడీవాని కరమునందుండు పనమువంటి చక్రముధరిం
        చిన నీవును, హాలికుని విధమున నాగలి బుజమున చాల్చు
        నీసహోదరవీర్డుబలభద్రుందును నాకు వెఱపు గలిగింప
        లేరయ్య."
కృ:- "ఓరీ లోకైకపూజ్యుడగు మాయన్న మాలలిచ్చట దడవనేల!
        మీయన్నవలె మాయన్న జూదగాడుకాదు."
అర్జు:- "మాయన్నకు మీయన్నకు ఏఅంశమునందును సాటియేలేరు
         సుమీ. మాయన్న ధర్మరాజగు మీయన్న అధర్మరాజు
         మృషగాదు హరీ."
కృ:- "పేరు ధర్మరజు, పెను వేపవిత్తులందు, మాట తేనెతేట
       మనసు విషము, నేతిబీరకాయ నీయుధిష్ఠిరశబ్దమొఱకలేని
       దారి యెదుటసాగడు"
అర్జు:- "చివరిచుత్డవయ్యు మత్సోదరుల సౌజన్యము గ్రహింప
         జాలవైతివి. వేయేండ్శ్లు తపస్సుచేసినను మాకు మీరు
        సాటిరారు."
కృ:- "నిజము - ఏలనందువా? "నీచముచ్చములేక రాచపాడి
        దొఱంగి బిడియమించుకలేక బిచ్చమెత్త, జన విరుద్ధంబున
        సైదోడులేవురు వెలదినొక్కర్తునే పెండ్లియాడ"
అర్జు:- "అవును మరి - మీరు చేయుపనులు మేము చేయగలమా
          బావా! అల్లుడా రమ్మని ఆదరమ్మున పిల్వ పంపు మామను