పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/386

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హంసపదిక రుక్మిణీ సత్యభామలతో ఏదోచెబుతుంటే అదెమిటని కౌశికుడుప్రశ్నిస్తాడు. దానికామె "నీకడుపులో అనుమానం పీడించుచున్నది గాని, నీవిషయము నేవెవ్వరితోనెమియూ జెప్పలేదు. అనేక అవతారములెత్తిన శ్రీమన్నారాయణుని చెలికాడనగుటచేత నీవును కొన్ని అవతారము లేత్తనేర్బితివనిమాత్రము వీరితో చెప్పదలచితిని" అన్నది. దానిపై కౌశికుడు 'ఏమె అవతారము లెత్తనేర్చితిని ': అన్నది. దానిపై కౌశికుడు 'ఏమి అవతారము లెత్తనేర్చితిని ': అని దబాయించగా, ఆమె "ఆయన నరసింహావతారంత్తెను, నీవు గడియక్రింద గ్రామ సింహావతారమెత్తితివి" అంటుంది. ఇలాంటిసాహిత్యచలోకులతో కూడిన సుతుమెత్తని హాస్యంకూడా ఉంది.

   గయునిసంహరింప విష్ణుచక్కము వచ్చుచున్నదని ఆకశవాణి చెప్పినప్పుడు-

                 "నా మనోహరుగాని నన్ను రక్షింపరే
                   పుణ్యులార, పుడమి వేల్పులార"

అని రోదించే చిత్రరేఖావిలాపం, గయుడు విష్ణుచక్రంబారినుండి తప్పించుకోవడానికి పలువురిని ఆశ్రయించి వినలుడై "పాతాళమునకేగి బ్రతుకవచ్చునటన్న బలిచక్రవర్తినన్ పట్టియిచ్చు" అంటూ దీనంగా విచారించేఘట్టం ప్రతివరిచేతా కంటతడిపెట్టిస్తుంది. ఇక్కడ కరుణరసం ఏరులై పారుతుంది.

     "శరణు శరణు" అని కాళ్ళమీదపడిన గయునికి అభయమిస్తూ అర్జునుడు "నిటలాక్షుండెత్తివచ్చినను రానీ" అనిపలికే వీరాలాపములు వీరరసాన్ని ప్రస్పుటింపచేస్తాయి. చేతిలో నిష్ఠీవనంబు పడినప్పుడు ఉగ్రుడయిన కృష్ణుడు "శ్రీమచ్చతురానన, పంసానన, షణానన, సహస్రావన, వజ్రాయుధ, పంచాయుధ, సిద్ధ, సాధ్య యక్షగరుడకిన్నర కింపురుష విద్యాదరాద్యఖిల ఖేచర సమూహంబులు ప్రతిఘటించినిల్చిన నిల్తురుగాక" అని చేసిన ప్రతిజ్ఞలో భాయానకరసం పరాకాష్ఠనందుతుంది.  అలాగే కృష్ణుడు సూర్యునకు అర్ఘ్యమిచ్చుచుండ 'తమ్ముల ఉటుమ్మివడియె హస్తంబునందు ' అనే దానిలో చేతిలో ఉమ్మిపడుట జుగుప్సను కలిగిస్తోంది.  ఇది భీభత్సరసానికిస్థాయి.  కృష్ణార్జునుల యుద్ధఘట్టంలో కృష్ణుడు -