పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టెక్స్ టు వదిలేసి నాటకంనడపకుండా గంపలకొద్దీస్వగతంతో ఏకపాత్రాభినయంలాఛేసేస్తూ స్టేజీని, టైమునీ మింగేస్తూ, పచ్చిబూతులు మాట్లాడేస్తుంటే గవర్నమెంటు నిషేదించవలసింది. భోగంమేళాలకంటే ముందు చింతామణినాటకాన్ని అనిచెప్పవలసివస్తుంది. శ్రీహరి, సుబ్బిశెట్టిలిద్దరూ ఈ నాటకాన్నిలా సజీవసమాధిచేయడం క్షంతవ్యంకాదు.

                     గ యో పా ఖ్యా నం
    ప్రాచీన తెలుగునాటకాలలో విశేషప్రశస్తిగన్న మేటినాటకం చిలకమర్తివారి గయోపాఖ్యానం. లక్షప్రతులకుపైగా అమ్ముడుపోవడమే దీని విశిష్ఠతకు ప్రత్యక్షతర్కాణము.  ఆంధ్రదేశంలో యీప్రదర్శన జరగని ఊరూ లేదు, ప్రదర్శిచని పౌరాణికనాటకసమాజమూలేదు.
    ఈ ప్రాతీననాటక సమీక్షకు ఆధునికపు తూకపురాళ్ళువాడితే విమర్శనాపద్దితికే విరుద్ధం.  దీని కొలబద్దలు వేరు.  సంస్కృత నాటక లక్షణాలతో వ్రాయబడ్డ దృశ్యకావ్యం. బెర్నాడ్ షా ప్రోలోగ్స్ లాగ, నేటి ముందుమాటలాగ, నాడు నాందీ ప్రస్తావనలు ఉండేవి.
   నాటకం ప్రారభించడానికి ముదుఆచరించేకర్మవిశేషం నాంది.  ఇది పూర్వరంగం, ఉత్తరరంగం అనేది నేపధ్యంలో చెప్పబడే ఆశీస్సు అదియిందులో 'బ్రహ్మనయమ్ము నోముతన్ ' అనే వాక్యం అంతరంగాల మధ్యం. ఉత్తరరంగంలో సూత్రధారుడు, నటి ప్రవేశించి నాటకాన్ని గురించి, రచయితనుగురించి, ప్రదర్శనగురించిచేసే ప్రసంగం, ఋతువర్ణన అనంతరం పాత్రప్రవేశం సూచించడం ప్రస్తావ్న అంటారు.  ఇందులో నాటకరచయిత 'చిలకమర్తి ' అని, యితివృత్తం "వస్దేవత్మజ పాండునందనుల సంవాదంబె ' అని చెప్పి వసంత ఋతువు వర్ణన చేసి "సూత్రధారుడు నటితో సాత్యకియు, కౌశికుడు తెరచాటునుండి చూచుచున్నారుమనవంక  సుదతిరమ్ము" అని పాత్రప్రవేశం సూచించి నిష్క్రమిస్తారు.  ఇలా లక్షణబద్దంగా ప్రారంభమవుతుంది యీ నాటకం.
   ఇక యితివృత్తానికొస్తే ఆధునికంగా యీకధ యిలాచెప్పవచ్చు. గయారావు అనె ఒకాయన కరులోవెళుతూ బయటకూమ్మేశాడుచూడ