పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుండా. ఇది ఆరోడ్డుప్రక్కనబడ్డ కృష్ణమూర్తి అనే కామందుమీద పడింది. ఆయనక్కోపం వచ్చింది. కరులీవెళ్లేవారెవరో తెలుసుకుని 48 గంటల్లో ఆ గయారావుని "మర్డర్" చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది గయారావుకి తెలిసి హడలిపోయి మండల ప్రెసిడేంటుగరి దగ్గరికెళ్ళి రక్షించమన్నాడు. ఆకృష్ణమూర్తి బలంతోనె నేనుప్రెసిడెంటయ్యాను. నావల్లకాదన్నాడు. గయారావు బెంబేలెత్తిపోయి తిరుగుతుంటే నారయ్యనే ఆసామీ ఓచిట్కా చెప్పేడు. ప్రక్కఊరిలో కృష్ణమూర్తిబావ అర్జునరావున్నాడు. అతనికాళ్లమీదపడి రక్షిస్తానంటే గాని విదిచిపట్టకు. బావగారితో తగవుకు కృష్ణమూర్తి సిద్ధపడడు. దానితో నిన్నొదిలేస్తాడు. నువ్వు ముందుమాత్రంవిషయంచెప్పకుండా వాగ్ధానంపుచ్చుకో అని సలహాయిస్తాడు. గయారావు సరిగ్గా అలాగే చేస్తాడు. అర్జునరావు అభయమిస్తాడు. కృష్ణమూర్తి పుట్టింటిదగ్గరున్న చెల్లెలు సుభద్రమ్మనిపంపిస్తాడు యీ గొడవలోకి రావద్దని భర్తకు చెప్పమని. అర్జునరావు ఆమె మాట వినలేదు. కృష్ణమూర్తి స్వయంగా వచ్చి నయానా భయానా చెప్పి చూస్తాడు. అర్జునరావు లొంగకుండా గయారావుని రక్షించడం కోసం పోరుకు సిద్దపడ్డాడు. అప్పుడు మంత్రి శివయ్యగారొచ్చి ఆదెబ్బలాట ఆపుచేసి, క్రిందికిచూసుకోకుండా ఉమ్మివేయడం గయారావుతప్పనీ, తెలియక ఉమ్మెసినదానికి ఏకంగా చంపెయ్యడానికేపూనుకోవడం కృష్ణమూర్తితప్పనీ, ఆలోచించకుండా అభయం యివ్వడం అర్జునరావు తప్పనీ చెప్పి, ఇద్దరూ కావలసినవళ్ళు, బంధువులు, ఒకేపార్టీవాళ్ళు కావడంవల్ల దెబ్బలాటతగదనీ, గయారావు కూడా వారి వర్గంవాడ్??ఏననీ, నిజాయతీఅయిన కార్యకర్తనీ తెలిపి తెలిపి తగవు పరిష్కారంచేస్తాడు. అప్పుడు కృష్ణమూర్తి మావూళ్ళొ అందరిముందూ నేను గయారావుని చంపకపోతే సుబ్బారాయుడుకొడుకునేకానని ప్రతిజ్ఞ చేశానే? అన్నాడు. దానికి శివయ్యగరు నువ్వుల్ నిజంగా సుబ్బారాయుడు కొడుకువిగావుగా! దత్తుడివిగా! అంచేత ఆమాటలకిబ్బందేమీలేదని సర్దేస్తాడు. దీన్ని పురాణపాత్రలలోకి జాగ్రత్తగామలిచి కృష్ణుడు యమునానదిలో సూర్యునకర్ఘ్యమిస్తుంటే బ్రహ్మలోకంనుంచి విమానంలోవెళుతున్న మణిపురాదీసుడైన గంధర్వరాజుగయుడు విష్ఠివనమ్ము విడువగా అది కృష్ణునిదోసిలిలోకిపడింది. దానికి కృష్ణుడు ఉగ్రుడై అతనిని సంహరింప ప్రతిజ్ఞ బట్టి చక్రాయుధాన్ని విడిచిపెడతాడు ఇది