పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/381

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా మో ద రు డు గా య కు డా ?

    ఈ వేషంవేసేవాళ్ళు సాధారణంగా నారదునిపాత్రలాగ తెగపడేయడమె ప్రధానంగా పెట్టుకుని వేస్తుండడంవల్లా, ఎప్పుడూ హాస్యపుమాట ఉచ్చరించడమే ఎరుగనివాళ్ళూ, పధ్యాలు కట్రాడిలా నిలబడి బడిపిల్లాడిలా దడదడ అప్పగించేసి, ఛేంతారాగం తీసిపారేసేవాళ్ళూ ఇంతవరకూ ఈ పాత్రవెయ్యడంవల్లా ప్రేక్షకులలో దీనికి గాయకుడుగా ముద్రపడిపోయింది.  వాస్తవానికి పాత్రయొక్క వచనంలో సున్నితమైన హాస్యముంది.  రేడియోబవగారిలా మటవిరిచి చక్కగా హస్యపూరిత అభినయంతోఅంటే యిది అన్నింటికీమించిన సున్నితమయిన్ కమెడీరోల్ అవుతుందనేది నిస్సందేహం.
    తొలిరంగంలో దామోదరుని ఒకభక్తునిగా చూపాలనేది భావం దానికోసం తెరముందుకువచ్చి తిక్కన్నగారిపద్య్హం "అరయన్ శంతను పుత్రుపై" అనే మత్తేభంఅంతాచదివి ఆపై బోలెడురాగంతీసి బల్లమీదున్న రాధా, బిళ్వకంగళ పాత్రలను బలితీసుకోవడం నాటకానికి లక్షణంకాదు.  నాళ్ళు 4 నిమిషాలసేపు నిర్విరాకారంగా కూచోవడం నాటకజ్ రమ్యతను చెడగొడుతోంది.  దానికిబదులు "హరేరామ రామరామ హరేహరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే" అంటూ ప్రవేసిస్తేదామోదరుని భక్తిభావం యిట్టే అర్ధమవుతుందిగదా! దీనివల్ల పక్క పాత్రలు దెబ్బతినక్కరలేదుకూడా.
   ప్రవేశంలో సుబ్బిసెట్టి చింతామణిని చూడగానే వెర్రిమొగంవేసి అదిరిపోతున్నట్లూ, బెదిరిపోతున్నట్లూ వెకిలిఅభినయంతో గంటన్నర తినేసే హాస్యనటులు ఒక్కసంగతి గుర్తుంఫుకోవడం అవసరం.  ఇతడు పచ్చి వ్యభిచారి.  రంగానాయకి అనే సానింటికి 7,8 సర్లు వెళ్ళానని తనే ఒప్పుకుంటాడు.  ఇక తెలుగే సరిగారాక అత్తమ్మను "లత్తప్ప" ని నాటుగ మాట్లాడే యీ సెట్టిపాత్రకు పాత్రధారులు స్వచ్చమైన ఇంగ్లీషు మాటలుకూడాజోదించి గుప్పెయ్యడం ఏమిన్యాయం? హాస్యాన్ని సృష్టించడం కోసం నాటకం ఆపేసి స్వంత డైలాగులు అసందర్బంగా తట్టలకొద్దీ వాగెయ్యడంకాదు సంర్ధత. పాత్ర స్వ్గబావాన్నికనుగొని వీలైనంతవరకూ అందుజ్లోని మాటలతోనే  మెరుగుతేవడం, అందున్ంచి అభినయంతో హాస్యం పుట్టించడం ఉత్తమనటుల లక్షణం  ఉన్న