పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/376

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాటకంనడిపి నిర్ధాక్షిణ్యంగా పెంచేసి కాలాతీతంచేసి ప్రేక్షకుల్ని చివరిసీనుదాకా కూర్చోలేకుండా చేస్తున్నవి యిలాంటి అనవసరపు కల్పనలే. వీరబాహుడు; యముడు అనేది యీకధలో "ట్విష్టు", అది చివరిదాకా గుప్రంగావుండి ఆఖరున తెలిస్తేనె సరిగా నిర్వహింపబడినట్లు. అందుకే రచయిత యిది చివరన తెలిపాడు. ఇది ఆ స్వగతంలో ముందే చెప్పేయడంవల్ల కావలసిన సస్పెన్సుపోతోంది. రచయితప్లాను దెబ్బతింటోంది. ఇక యీ నాటకంలో ముఖ్యమైన అంశం ఆఖరున పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై హరిశ్చంద్రునిమెచ్చి వరములనీయడం వగైరా, ఈ భాగాన్ని అవ్వరూ ప్రదర్శించకపోవడంవల్ల సత్యవాక్కును వచ్చిన పద్య:ఫలం చివరికిమిగిలిన కొద్దిపాటి ప్రేక్షకులకుకూడా తెలియడంలేదు.

      అందువల్ల నేటి పరిణామవేగాన్ని, వాతావరణాన్నీ అనుసరించి షేక్సిపియర్ హేం లెట్, మేక్ బెత్ వగైరానాటకాలు ఎబ్రిడ్జిచేసి ఎలావేస్తున్నారో అలాగే ఈనాటకాన్నికూడా అక్కరలేనిభాగాన్ని తగ్గించి మొత్తంనాటకాన్ని రెండున్నరగంటలకు కుదిస్తే ప్రేక్షకులు మధ్యలో లేచి పోయేరన్నబాధ ప్రదర్శకులకూఉండదు,  నాటకం ఆసాంతం చూడలేక పోతున్నమన్నబాధ ప్రేక్షకులకూఉండదు.
                 చిం తా మ ణి నా ట కం
        ప్రాచీననాటకాలలో యీనాటికీ జానపదులలో సజీవంగా నిలబడగలిగిన నాటకాలలో కాళ్ళకూరి నారాయణరావుగారి "చింతామణి" ఒకటి.  దీనికి కారణం యిందులోని కధా సంవిధానం, సార్వజనీనము, సార్వకాలికమూనయిన సాంఘికప్రయోజనంగల యితివృత్తం, కండపుష్టి కలిగిన పద్యరచన, రచనాశిల్పం, రసపోషణ, అలంకారప్రయోగం, చరురోక్రులు, మధులోక్తులు, హాస్యోక్తులు కలిగిన సన్నివేశాలు, భిన్న మనస్తత్వాలుగల తారాతోరణం ఈ నాటకాన్ని పండిత పామర జనరంజకంగా చిరంజీవిని ఛేశాయి.
  ఇందులో ముఖ్య పాత్రలు బిల్వమంగళుడు, భవానీశంకరుడు, సుబ్బిశెట్టి, దామోదరుడు, శ్రీహరి, చింతామణి, చిత్ర, రాధ.