పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/377

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాటకం దృశ్యకావ్యంగదా ! దీనికి ముందుగా పాత్రల వయస్సులు, స్వభావాలు నిర్ధారించుకోనిదే ఆహార్యం, వాచికం సరిపెట్టడం సాధ్యంగాదు. ఇందులో ఆ పాత్రల వయస్సులూ, స్వభావాలూ తెలిసికోవాలంటే నాటకంలోని వివిధ విషయాలఆధారంగా యీ నిర్ణయం చెయ్యవలసి ఉంటుంది.

    బిళ్వమంగళుడు, భవానీశంకరుడు సహా ధ్యాయులుగాన వీరివురిదీ ఇంచుమించు ఒకేవయస్సు అయివుండాలి,  బిళ్వమంగళుడు, దామోదరుడు మిత్రులు గనుక వీరిరువురిదీ కూడా దాదాపు ఓకటేవయస్సుగా భావించవచ్చు. అంటే ఈ ముగ్గురూ సమ వయస్కులు. వీరికందరికీ భార్యలున్నట్లు చెప్పాడేగాని ఏఒక్కరికీ పిల్లలున్నట్లు ఎక్కడా చెప్పలేదు.  అంటే వీళ్ళంతా గొడ్రాళ్ళే అనుకోలేంకదా! అందుచేత వీళ్ళకి పెళ్ళిళ్ళయి యింకా ఎంతోకాలం కాలేదనిమాత్రం మనం అనుకోవాలి.  ఆరోజుల్లో మగవాళ్ళు పెళ్ళివయస్సు సాధారణంగా 20-25 సంవత్సరాలమధ్య్హ వుడవచ్చు.
  ఇక సుబ్బిశెట్టి - ఇతనిగురించి చింతామణీతో శ్రీహరి అన్న మాట "అతడీమధ్య తండ్రికన్నులలో  కారంచల్లి కాసులకుకాసులుతెచ్చి ఖర్చుపెట్టుచున్నాడనికూడా విన్నాను" అంటే యితను తండ్రిచాటు బిడ్డన్నమాట. డబ్బు స్వేచ్చగాఖర్చుచేసుకొనే అవకాశంరాని వయస్సు.  దీనినిబట్టి ఆలోచిస్తే స్థూలంగా అతని వయస్సుకూడా 25-27 ల మధ్యే ఉండవచ్చు.  మరియాపాత్రలు ఆరుపదులుదాటి పళ్ళూడిపోయిన ప్రముఖులు వేస్తుంటే ఔచిత్య సంగతేమిటి?
    ఇక శ్రీహరివయస్సు చెప్పడానికి శ్రమపడనక్కరలేదు.  ఆమెను గురించి దామోదరుడుచేసిన వర్ణననుబట్టి ఆమె 70 ఏండ్ల పైబడ్డముసలిది అని తెలుస్తోంది.  కవిచెప్పిననాటకం ఇంతస్పష్టంగావుడగా కొందరు శ్రీహరిపాత్రధారులు నడివయస్సుపిల్లలాతయారై బండబూతులుమాట్లాడుతూ బిగిసడలని భరతనాట్యాలు కట్టడం మరీవిడ్డూరం. పైగా స్వగతాలరోజులుపోయి దశాబ్ధాలుగడిచిపోయినా నాటకంలో వ్రాసిన స్వగతాలు చాలవన్నట్లు రచయిత కవిత్వానికి వీరిపైత్యంకూడాజొడించి చేంతాదు లాంటి స్వగతాలు పుట్టలకొద్దీవాగెయ్యడంచూస్తే యిది "చింతామణి" నాటకమా "శ్రీహరి, సుబ్బిశెట్ట్టి" నాటకమా అనిపిస్తుంది.