పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/378

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇక చింతామణి - ఈమె పరువంలోవున్న పడుచు, సుందరాంగి అనేది బిళ్వమంగళుని యీ క్రిందిపద్యంలో మనకు కళ్ళకుకట్టినట్లు కనబడుతోంది.

బిల్వ:- "ఓహో ఏమి సౌందర్యము!
ఉ. "రెప్పలు వాల్చకుండిన ధరిత్రిని బదము లంటకుండిన"
     దబ్బకరంభయో, మృతాచియొ. మేనకయోయటంచనీ
     కపురగంధిపట్ల భ్రమ కల్గకపోవునె? యాలకింపలే
     దిప్పురమందె యిట్టి జలజేక్షణ యున్నదటంచునెప్పు
     డున్ ".

     స్త్రీకి యీ లాలిత్యం, లావణ్యం, సోయగం సధారణంగా 18-28 ఏండ్లమధ్యనే ఉంటుంది.  కాబట్టి ఈమెకూడా 24-28 ఏండ్ల మధ్య నవనవలాడుతూ నాజూగ్గా వుండివుండాలి.  కాని నేటికాలంలో యీపాత్ర వల్లమాలినవొళ్ళుపెంచుకుని వయసుమీర్నవనితలు వేస్తున్నారు.
    ఇక రాధ: ఈమె బిల్వమంగళునిభార్య కావడంవలన హైందవసంప్రదాయానుసార్ం ఆమె అతనికంటె ఎంతోకొంత చిన్నదే అయివుండాలి.  కనుక ఆమెవయస్సు 20-24 సంవత్సరాలుగా చెప్పవచ్చు.  భవానీ శంకరుడు చింతామణితొ బిల్వమంగళునిగురించి చెప్పేటప్పుడు "అతని భార్య భూలోకరంభ" అంటాడు.  అంటే యీమెకూడా అద్వితీయ సౌందర్యవతె అని తెలుస్తోంది. అతను ఆమాటప్రయోగించిన సందర్భమునుబట్టిచూస్తే ఆమె యించుమించు చింతామణికంటె సౌందర్యవతి కావచ్చునేమో అనిపిస్తుంది.  అటువంటిపత్రను నేడు నాటకాలలో ధనాభవంవల్లనో, తగుశ్రేద్ధలెకనో, నటీనటులు లభ్యంకాకనో మొక్కుబడిగా ఎవరో మొగంముడతలుపడిన ముసలమ్మతోనో, రూపురేఖలులేని అనకారితోనో వేయించి తంతునదిపిస్తుండడం చాలా అన్యాయం.
    చివరిపాత్ర చిత్ర్ర: ఈమె మాటల్లోని అమాయకత్వం వయసురాని ఏదిగీఎదవని కసుగాయ మనస్తత్వాన్ని సూచిస్తుంది.  ద్వితీయాంకంలోప్రవేశిస్తూ "అమ్మా! ఎవరో సుబ్బిశెట్టిగారంట, పెద్దిశెట్టిగారి కొడుకంట, లోపలకొచ్చి అక్కయ్యేంచేస్తోందని అదిగారు.  ఆమటున అదేంటిసెప్మా  ......" అని ఆలోచిస్తుంది.  ఈ మరుపుధోరణి ఎదగని