పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క ల హ కం ఠి ఎ వ రు?

       నాటకాంతంలో విశ్వామిత్రుడు హరిశ్చందునితో "పనిగత్తెగ నీ వనితను గొనినాడతడు  బాలచంద్రకోటీరుడు" అంటాడు. అంటే చంద్రమతిని బానిసగకొన్న కాలకౌశికుడు పరమేశ్వరుడు.  దీనివల్ల అతని భార్యయైన కలహకంఠి పార్వతీదేవి అని తెలుస్తోంది.  నేటిప్రదర్శనల్లోయీ కలహకంఠిమాట్లాడేబూతులు చింతామణిలో శ్రీహరి బూతుల్ని తలదన్నుతున్నాయంటే అతిశయోక్తికాదు. రచయితవ్రాయని ఒకబండెడు స్వగతంబట్టీపట్టుకొచ్చి, ఎకసక్కేలాడుతున్నారంటూ ప్రక్కింటివాళ్ళనీ, పిల్లలుపుట్టించలేని అసమర్ధుడని మొగుణ్ణీతిడుతూ హాస్యంపేరుతో ఆశ్లీలం వలకడం ఆపాత్రకు అన్యాయం. పోనీ యీ మాటలు చంద్రమతి ఉండగా అంటే ఆమెవద్ద అట్లు నటించవలసిన అవసరం వుందిగదా అని సరిపెట్టుకోవచ్చు - కానీ ఎవరూలేకుండా తను ఓ అరగంట ఆశ్లీలపదాలతో ఏకపత్రాభినయంచెయ్యడం పార్వతీదేవికి అపచారం.  రచయిత ఆమెను గయ్యాళిగా చూపినది చంద్రమతి సమక్షంలోమాత్రమే.  ఇది గమనించకుండా పాత్రధారులు నటిస్తుండడం శోచనీయం.
                   వీరబాహుడు విలపించడం దేనికి ?
     అసలు వెరబాహుడెవరు? చివరకు విశ్వామితుడు చెబుతాడు.  హరిశ్చంద్రునితో "నినుదాసునికగొన్న కాటిరేడు యముడుగాని కడజాతి వాడుకాదు" అని.  ఈనాడు చేస్తున్న ప్రదర్శనలలో వీరబాహుడు పాత్రధారులు హరిశ్చంద్రునికి కుండ, కర్ర యిచ్చి కాటికాపరిగాపంపి హరిశ్చంద్రుని తను కష్టపెడుతున్నానని పరితపిస్తూ గంపెడు స్వగతంతో పశ్చాత్తాపం ప్రకటిస్తూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు  తను పెట్టే కష్టాలకు తట్టుకొనికూడా సత్యంకోసం నిలబడగలడాలేడా అనే పరీక్షచెయ్యడానికిదిగివచ్చినవేల్పు యముడు. అంటే ఒక ఉద్దేశంతో ఆ కష్టాలు తనేకల్పిస్తున్నాడు.  అటువంటప్పుడు తనేఏడవడమేమిటి? పశ్చాతాపం దేనికి? ఇది చాలా అసంబద్ధం.  రచయిత అలా వ్రాయలేదు.  పరీక్ష మేరకే ఆపాత్రవ్రాశాడు.  దానికి స్వంతపైత్యంకల్పించేసి ఓ అరగంట పైగా యముణ్ణి మనముందు ఏడ్పించడంవల్ల కధకుకలిగిన బలమేమిటి? "క్లయిమాక్సు"లో అసలుకధ వేగంపుంజుకుంటుంటే దాన్ని ఆపుజేసి