పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆకధలోని ప్రధానపాత్రల వేషాలలోకొందరు రంగప్రవేశంచేసి నృత్యంతో పాడుతూ డైలాగులు చెబుతూ అభీనయిస్తుంటారు.

      ఈరచయిత సుశీలారాణి, కొవ్వూరి రామకృష్ణారెడ్డి వగైరాలతో బృందంగా ఏర్పడి 'సుభాస చంద్రబోస్ ' జముకులకధ జముకువాయిస్తూ చెబుతుంటే జనం తోసుకుమరీ  ముందుకువచ్చేసేవారు.  వేషాలుచూడాలనీ దగ్గరనుండి కధవినాలనీను.
                య క్ష గా నా లు
   ఇవి ప్రదర్శించేభాగవతులలో కూచిపూడిభావవతులు, గొల్లభాగవతులు, యానాదిభాగవతులు, తూర్పుభాగవతులు అని అనేక విభాగాలున్నాయి. వీరందరూ ప్రదర్శించేవి యించుమించు సంగీతనృత్య నాటకాలే.  వీనినే యక్షగానాలన్నారు.  నటీనటులు వేషాన్నిధరించి భావాన్నిఅంగికంతోనూ సత్వికంతోనూ పాటలతోనూ మాటలతోనూ ప్రదిర్శిస్తారు.  నాటకానికికావలసిన సర్వలక్షణాలూ ఇందులో భసిస్తాయి.  చాలవరకు వచనాన్ని కూడా రాగయుక్తంగా చదివి అర్ధవివరణచేస్తుంటారు.  ప్రతిపాత్రా తన్ను గూర్చి పరిచయం ఒకదరువులోపాడుతూ రంగప్రవేశం చేస్తుంది.  "సూత్రధారి వచ్చె చూడండి జనులార" అనే దరువుతో విదూషకుడు, "రాజుజ్ వెడలె రవితేజము లరగ" అనే దరువుతో రాజుపాత్ర ప్రవేశిస్తాయి  దీనికినట్టువాంగం మద్దెలగాడూ, తిత్తిగాడూ (శ్రుతి). ఒకరిద్దరు వంతపాటకులు. తెలుగుదేశంలో పేరు విన్నంతనే ఫక్కున నవ్వు తెప్పించేపాత్రలు సింగి, సింగడు, చోడిగాడు యిందులోవే! వీనిని కురవంజిలనేవారు.  ఇది యక్షగానరూపానికి తొలిరూపం
         కూ చి పూ డి భా గ వ తు లు
   భావవతులలో కూచిపూడివారి బాణీవేరు.  వీరికి మూలపురుషుడు సిద్దేంద్రుడు.  ఆయన ఏర్పరచిన సంప్రదాయంప్రకారం స్త్రీవేషాలుకూడా పురుషులేవేసేవారు.  ఇందులోని నృత్య రీతులు, అభినయ భంగిమలు, ముద్రలు శాస్త్రీయ పడికట్టులో ఉంటాయి.  నట్టువాంగం రంగంమీదే ఉంటుంది. 'భామనే సత్యభామనే ' అనే దరువుతో సత్యభామ రంగప్రవేశం, సత్యభామ జడవర్ధన వీరి భామా కలాపంలో మంచి పట్టుగల అంశాలు.