పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/363

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"గొల్లభామా వచ్చేనే చల్లోయని" అనే దరువుతో ప్రవేశిస్తుంది గోపిక. ఇందులో జీవాత్మ, పరమాత్మ, పిండోత్పత్తి, సృష్టివగైరా లోతైన విషయాలు గొల్లభామ, బ్రాహ్మణ పాత్రల సంభషణలలో చమత్కారాలతో సరళ సుందరంగా సుబోధకం చేస్తారు. ఇందులో గొల్లభామ "అయ్యవారు! అనే తీగడతోచెప్పే ఒక మాండలిక సంభొధనలోని మాడ్యులేషన్ ఈ కలాపానికి జీవం. వీరు ఉషాపరిణయం, భక్తప్రహ్లాద, విప్రనారాయణ వంటి కండగల యక్షగానాలుకూడా ప్రదేర్శిస్తారు.

                   తూ ర్పు భా గ వ తు లు
   తూర్పుభాగవతులు విజయనగరం ప్రాంతాలవారు.  స్త్రీపాత్రలు స్త్రీలేవేస్తారు.  మద్దెల, తాళం, తిత్తి మామూలే.  పాట, మాట మాత్రం తూర్పు యాసలో ఉంటాయి. రాగం తోలుబొమ్మలాట రాగాలను పోలి ఉంటుంది.
  "చిటపట చినుకులు దుప్పటి తడిసెను తలుపు తీయవే భామా" అనే కృష్ణ గోపికా సంవాదం, 'ఏదిరా లక్ష్మాణా సీతా? పర్ణశాలాలో లేదెందు సేతా " అనే రామ లక్షణుల సంవాదం వీరిదే,  ఏడు వారాల నగలు దరించే వీరి సత్యభామను చూసితీరవలసిందే. నృత్యంలో పెద్ద శాస్త్రీయ నిబద్దత ఉండదు.  వీరు గొల్లకలాపం, భామాకలాపం, కురవంజీలు ఎక్కువగా ఆడతారు.  ఒక దళం విజయనగరం దగ్గజ్ర లక్కవరం గ్రామంలో ఇప్పటికీ ఉన్నారు.
                     దే వ దా సీ లు
     దేవదాసీలు కూడా భాగవతుల ఫక్కీలో కలాపాలు ప్రదర్శించేవరు.  దేవుడు కళ్యాణాలను పల్లెటూళ్లలో భోగంమేళాలు పెట్టేవారు.  సంబరం అయిన మరుసటి రోజు రాత్రి ఆ మేళంలోనివారు భామాకలాపమో, గొల్లకలాపమో ప్రదర్శించేవారు.  ఒకనాడు అన్నాబత్తుల చిట్టి, అన్నబత్తుల బులి వెంకటరత్నం, నాయుడు సత్యం ఇందు పేరెన్నికగన్న నట్టువరాండ్రు.  వీరి నృత్యరీతు, ముద్రలు, భంగిమలు కూచిపూడివలె శాస్త్రబద్ధం.  రాగాలాపన మాత్రం జానపదం - తూర్పు భాగవతుల పట్టు