పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/361

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తో లు బొ మ్మ లా ట

    దీనిలో వాచకం, ఆహార్యం, అంగికం ప్రదర్శితమౌతున్నాయి.  తోలుబొమ్మలకు మనుషులగొంతుజోడించి పాటలూ పద్యాలూ దరువులూ సంబాషణలలో ఆయా పాత్రలకు వాచికప్రయోగం జరుగుతుంది.  మగబొమ్మలకు పురుషులు, ఆడబొమ్మలకు స్త్రీలు గొంతులు జతచేస్తారు.  బొమ్మలకు ఆయాపాత్రల రూపధారణ రంగుల్లోచేసిప్రదర్శించడంవల్ల ఆహార్యం పోషింపబడినట్లే   పాత్రల సంభాషణలనుబట్టి బొమ్మలచేతులూ, కాళ్ళూ, మొండెం, శరీరంమీది యితర అవయవాలూ కర్రల సహాయంతో కదిలిస్తూ అంగికాభినయాన్ని సృష్టిస్తారు.  ఇవి బొమ్మలుగనుక సాత్వికాభినయానికి అవకాశంలేకపోయినా నేపధ్యంలోవారుచేసేసంభాషణలూ, కీర్తనలూ, రాగాలాపనలూ రసస్పోరకమై సామాజికులలో రోమాంఛకం సశ్వేదాదులు కలిగిస్తుంటాయి.  వీరికి రంగస్థలం నడివీధిలోపందిరి.  ఆ పందిరికి ముందుభాగం పల్చని, తెల్లని చీర యీతముళ్ళతో కుట్టి, కట్టి, మిగతామూడువైపులా గోనెబరకాలతో మూసేస్తారు.  లోపల బొమ్మల నాడించేవారూ, పాడేవారూ, వాయిద్యాలవారూ ఉంటారు.  తెరమీద బొమ్మలునిలిపి, బొమ్మలవెనుక ఆముదందీపాలుపెట్టి, పొడవాటికర్రలతో బొమ్మలను కదిలిస్తూ తెల్లవార్లూ ప్రదర్శిస్తారు.  యుద్ధఘట్టాలలో దరువు లకుసరిపడాఅరుపులు, బొమ్మలకదలికలు నిజంగానె యుద్ధంజరుగుతున్నదా ! అనిపించేలాచేస్తారు.  ఈబొమ్మలాటలు వేసేవారు ఆరేమరఠీలు తెలుగునాటహాస్యానికి పేరెల్లిన గాండోలిగాడూ బంగారక్కా కేతిగాడూ జుట్టుపోలిగాడూ వీరిసృష్టే.
                      జ ము కు ల క ధ లు
     మాలదాసరులనె ఒకతెగవారు ఇవి చెప్పేవారు.  గుమ్మడికాయ బుర్రతో చేయబడిన తంబూరా శ్రుతి, జముకులు ఒకరిద్దరు వాయిస్తుంటారు.  'కుంచానికి ఒకవైపు ' మేకతోలుతోమూసి అతికించి దానిమధ్య ఏకునార త్రాడు కట్తి, ఒకచేత్తోలాగిపెట్టి, రెండవచేత్తో లాగిపెట్టి, రెండవచేతిబొటనవ్రేలితో మీటుతుంటే "ఝుం ఝుం" అనే శబ్దం వస్తుంది.  జముకంటే ఇదే.  వీరు చెప్పే కధలలో "సారంగధర", "దేశింగురాజుకధ" మంచి ప్రసిద్ధి.  ఇందులో నాటకప్రక్రియ ఏమిటంటే జముకులు వాయించేవారు కధాకధనంచేస్తుంటే