పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/360

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆదరించేవారు. భావవతులకు యింటికొక మనిషికివంతున భోజనాలుపెట్టి ప్రదర్శన అనంతరం పాతబట్టలు, పారితోషికాలు ఇచ్చి ఎన్నో పెట్టుపోతలతో ఆదరింఛేవారు.

   ఈ దేశంలో కళలకు సంబందించి ప్రత్యేకంగా చరిత్ర వ్రాయబడనందున వీని పుట్టుపూర్వోత్తరాలు తెలిసికోవడానికి సాహిత్యచరిత్ర ఒక్కటే దిక్కు.  దానిలో చొరబడి శోధిస్తే క్రీ.శ. 10వ శతాబ్దిలోని భారతావతారికలో రాజరాజు "ఉదాత్త రసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కు చూచితి" అన్నాడు.  12వ శతాబ్దిలో పాలకురికి సోమనాధుడు బసవపురాణంలో "కరమర్ది నూరూర సిగియాళ చరిత నటు నాటకంబులు నటియించువారు" అని చెప్పాడు.  ఇందు సోమనాధుడు పేర్కొన్న సిరియాళచరిత్ర తెలుగుయక్షగానంగనుక ఆకాలంలో ఖచ్చితంగా తెలుగునాటక ప్రదర్శనలున్నట్లు నిర్దారణగా చెప్పవచ్చు.
  *"16వ శతాబ్దిలోని తాయికొంద నాటకసమాజంలో ఒకస్త్రీపాత్రను స్త్రీయే ధరించినట్లు తెలుస్తుంది.  తాయికొంద నాటకసమాజం యక్షగాన సమాజమని ఊహించడానికి అవకాశంలేదనీ అది ఒక వీధినాటకమమే అయి వుంటుందనీ డా.యస్.వి.జోగారావుగారు తమ యక్షగాన వాజ్మయంలో తెలియజేశారు". నాటకానికి ఆయువుపట్టులు పాత్రోచిత వేషధారణ (ఆహార్యం), భాషణ, వాచకం వందర్భానుసారంగా ఆంగ ప్రత్యంగ కదలికలు (అంగికం), హృదయానుభూతివలన కలిగే రోమాంచకంపశ్వేదాదులు (సాత్వికం) అనేవి.  ఇవే చతుర్విదాభినయాలు.  రసోద్దీపనకై సంగీతం, నృత్యం కూడా జోడింపబడేవి.  పరిశీలించిచూస్తే ప్రాచీన తెలుగునాటక ప్రక్రియలలో ఇవి పుష్కిలంగా కనిపిస్తాయి.
    తోలుబొమ్మలాట, జముకులకధ, యక్షగానాలలో యీనాటకప్రక్రియ నిందుగావుంది.  కూచిపూడి భావవతులు, తూర్పు భాగవతులు, యానాది భావవతులు, దేవదాసీలు, మాదిగ భవవతులు దీని8ని బాగా పెంచి పోషించారు.  ఎర్రగొల్లలు మరింతముందుకు తీసుకుపోయారు.

  • మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, వీధినాటకవ్యాసం, నాట్యకళ, ఫిబ్రవరి - మార్చి 1970 పు.84