పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/359

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రిప్పి ఒకదెబ్బకొట్టేడు. ఏడునిమిషాలకి ఎగిరెళ్ళిపోయాడు. లోపలికెళ్ళి బూబిని పిలిచాడు. మంచిమంచిపువ్వులు వొళ్ళోపోసుకుఇ పరుగెత్తికొచ్చింది బూబినాంచరమ్మ. వెంకన్న కుడివేపుతొడమీదకూర్చుంది. నేను రానంటే బలవంతంగా తీసుకొచ్చావు నా సంగతేమంది మంగమ్మ. మంగమ్మకు ఎడమతొడచూపి కూర్చుండబెట్టుకుని శిలలైపోయారు. ఆనాటి నుండీ వేల్పులై భక్తులకోర్కెలు తీరుస్తున్నారు. ఇదీ ఆ జానపదగాధ.

  దీనికిసాక్ష్యంగా తిరుమలలోని కోనేటిని ఆలంవారికోనేరూనిఈ, దీనిని మామగారయిన ఆలమదారకుడు త్రవ్వించారనీ కధలో చెపుతారు.  తిరుచానూరును మంగమ్మపట్నం అనీ, శ్రీలక్ష్మీ భూలక్ష్మీ దేవీలను మంగమ్మా, బూబీ నాంచారమ్మలనీ, ఆఏడుకొండల్ని యీకధలో చెబుతున్నట్టు మోకాటిపర్వతం, చుక్కలగిరిపర్వరంవంటి పేర్లతో యీనాటికీ పిలుస్తుండడం కద్దు. ఆలయంలో ముఖమండపం గొల్లచ్చమ్మ కట్టించిందని కధలోచెబుతారు.  ఇప్పటికీ దీనిని గొల్లచ్చమ్మ మండపం అనడం ఉంది.  ఈ కధని 'వెంకన్నబాబు సేవ ' అని కోలసంబరంపాటగా పాడతారు.
      ఇలాంటికధలు పెద్దదేవుళ్ళపైనేగాక గ్రామాల్లోని చిల్లరమల్లర దేవుళ్ళపైనకూడా వినిపిస్తుంటాయి.  అయితే యివి కాలగర్భంలో కలిసిపోతున్నాయి.  పరిశోధకులు వీనిపై దృష్టిసారిస్తే తెలుగు జానపద సంపెద మరింత సుసంపన్నంకాగలదు.
                   వీ ధి నా ట కా లు
     తెలుగు దేశపు జానపద కళలలో నాటకం కూడా ఒకటి.  ఆదినుండి ఇది ఏదోరూపాన తెలుగు పల్లెల నడివీధుల్లో నడయాడుతూనే ఉంది.  ఒకనాడు అది ప్రత్యేకించి వీధి, భాగవతుల చేతుల్లో వివిధ రీతులా పోషింపబడేది.  వీరి తోలుబొమ్మలాటలూ జముకుల కధలూ ఇతర్ కళారూపాలూ యక్షగానాలూ నాటక ప్రక్రియకు సంబందించినవే.  అందుకే వీనిని వీధినాటకాలన్నారు.  20 వ శతాబ్ది పూర్వార్ధంలో కూడా ఈ ప్రదర్శనలు అక్కడక్కడ కనిపిస్తూనే వుండేవి.
    ఈ భాగవతులు బృందాలుగా బయలుదేరి ఊరూరా సంచారం చేస్తూ ప్రదర్శనలిచ్చేవారు.  గ్రామాల్లో ప్రజలు చందాలు వేసుకొని