పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/358

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రాసిపంపింది. "బావగారూ! రాత్రి మీతమ్ముడు నాగుళ్ళో కొస్తే తలుపు తియ్యకపోవడం నాదేతప్పు. దానికతడు ఈగుళ్ళపగలగొడతానని వెళ్ళేరు" అని వ్రాసింది. దానికి గోవిందరాజు "ఈనీతప్పుకి మాతమ్ముడు నిన్ను ముక్కలు ముక్కలుగా కండలుకోసి కాకులకీ, రెద్దలకీ ఎగవేస్తాడు. మేమేం చెయ్యలేం. వాడుసామాన్యుడుకాడు. నీదేతప్పు, అతనినెలాగో లాగ నువ్వేసరిదిద్దుకోవాలి" అని కబురెట్టాడు.

 అప్పుడు ఆమె అయిదుగురుబాలల్ని చెరువుదగ్గరెట్టింది. ఏడుకొండల వాడొచ్చాడు.  మొదటిబాలుణ్ణడిగాడు మంగమ్మపట్నం ఎలాగుంటుందని, మంగమ్మపట్నం ముస్తాబయిందన్నాడు.  రెండవవాణ్ణడిగాడు.  మా మంగమ్మపట్నం కొబ్బరిపందిళ్ళతో నిండిపోయిందన్నాడు. వెంకన్నకు కోపం దిగిపోయింది.  మూడవవాణ్ణడిగాడు - "ఆపట్నంలో ఏవంకచూచినా ఏకపిందివంటలే" అన్నాడు.  నాలుగోవాణ్ణడిగాడు - "మీ ఎద్దు మాఎద్దు గంగబొల్లెద్దు కిళ్ళమ్మచెరువుకి నీళ్ళకొచ్చాయి.  తాతగరెద్దొచ్చి తన్ని పొడిచింది. మావగారెద్దొచ్చి మంత్రమెసింది" అన్నాడు.  అయిదవాణ్ణి అడిగాడు "గారెలూ, బూరెలూ మా అమ్మవండించ్ఫి. బావకెట్టకుండా మాకెట్టనంది.  ఏడుకొండలవాడు మా అక్క మొగుడు" అన్నాడు.  దెబ్బకు కొపం పూర్తిగా దిగిపోయింది.  వెంకన్న మందుగుండు సామాను పారేసి ముందుకెళ్ళేడు.
  ఇమ అక్కడ మంగ జిలుగుపట్టీలు, జిల్లెడిగోళ్ళు ధరించింది.  వెంది తలగడ మంచాలపై వొళ్ళు వత్తకుండా మల్లెలుపోసింది.  దేవిడీ తలుపులు బారెట్టింది.  వంటింటిగదిలోకి కుక్కవెళ్ళినట్లు వెంకన్నవెళ్ళి పట్టిమంచం మీదపళించిన మంగనుచూసి ముగ్దుడైపోయి "మంగా! యీ పూలదండ తీసుకుని వేసుకో" అని యిచ్చాడు.  దానికి "మంగ మీరు ఇన్నాళ్ళదాకా దేనికిచ్చారో దానికేయివ్వండి" అంది.  'మంగా! ఇగిదో పట్టుచీరకట్తుకో మనఏడుకొండల్లోకి వెళ్ళీపోదాం రా ' అన్నాడు.  దానికి మంగ 'నేను అక్కడికి రాలేను.  నేనువస్తే నాపట్నం పాడైపోతుంది.  నాతీర్ధాలు ఆగిపోతాయి" అంది.  కోపంవచ్చింది వెంకన్నకు. కళ్ళెర్రబడ్డాయి.  'నీవు నామాట వినకుంటే నీగుళ్ళూఅ గోఫురాలూ కొట్టిపారేస్తాను.  కాళహస్తిపాయలో కలిపేస్తాను.  నేను గొవిందరాజు తమ్ముణ్ణి. లే ' అన్నాడు.  మంద భయపడింది.  బయలుదేరింది.  చెంతనున్న త్రాచుపాముతోక గిరగిర