పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రవిక, చీర యిచ్చి లక్ష్మీదేవిఒడిలోపడేసింది. మంగా లక్ష్మి కలిసి ఉంటున్నారు.

చెన్నపట్నంకోమట్లు మంగపేరుచెప్పి బొమ్మలవ్యాపారాలు మొదలు పెట్టారు. చిన్న వ్యాపారం పెద్దదయింది. కనకసిరి లక్షలు కలిగించింది. ఆకోమట్లు చందనంకర్రలు తెప్పించారు. మంగమ్మ రధాలుచేయించారు. గుళ్ళూ గోపురాలు కట్టించారు. పసిదికుండలెత్తారు. మంగమ్మ చెరువు త్రవ్వడానికి మంగాపురం ఉప్పర్లువచ్చారు. చద్దికూటేళ్ళకు సగం త్రవ్వేరు. సాయంత్రంవేళకి పూర్తిగాత్రవ్వేరు. చెరువులో స్ధంభాలెత్తారు. మంగమ్మపట్నం కట్టించారు. గుళ్ళో మంగమ్మను పెట్టారు. మంగమ్మతీర్ధాలు సాగించారు.

   ఒకనాడు అర్ధరాత్రివేళ నిద్రపొద్దువేళ వెయ్యిమాయలవానికి మంగమ్మజ్ఞాపకంవచ్చింది.  వెంటనే బయలుదేరివచ్చాడు.  మంగమ్మ నిద్రపోతోంది.  "తలుపుతియ్యిమంగా! తలుపుతియ్యి" అని పిలిచాడు. మంగమ్మ మేనుమరచి నిద్రపోతోంది.  సేవచేస్తున్న ఏడుగురు సుందరులు "అర్ధరాత్రి దొంగవైవచ్చావా దోచుకుపోవడానికి? తెల్లవారిప్రొద్దున మాతల్లి మేల్కొంటుంది.  ఇవాళపోయి రేపురా. నువ్వు ఇప్పుడుపోకుంటే మాఏడుగురం ఏడుఇరోకళ్ళతో నిన్ను చింతపండులా దంచుతాం పో" అన్నారు  అప్పుడు వెంకన్న "విన్నావా నా మంగా! ఇవాళపోతే రేపుపోతానా? ముగ్గురునౌకర్లను ముందేసుకొని మందుగుండు సామాను వెంటదెచ్చి నీగుళ్ళూ గోపురాలూ కొట్టిపారేసి కాళహస్తిపాయలో కలపకపోతానా? అలాచెయ్యకుంటే గోవిందరాజు తమ్ముణ్ణేకాను" అని ప్రతిజ్ఞచేసి వెళ్ళిపోయాడు.
         తెల్లవారాక ఆమెమేల్కొనగానే ఏడుగురు మందరలు ఆమెవద్దచేరి "మంగమ్మతల్లీ! ఇదివిను. రాత్రి నీదేవుడు నీగుళ్ళోకొచ్చాడు.  నువ్వు ఒళ్ళుమరచి నిద్రపోతివి తల్లీ.  నిదురలేపడానికి మావశముకాక పొమ్మాన్నాము" అని చెప్పేరు.  ఆమాటవిన్న మంగమ్మ నొచ్చుకుంది.  వాళ్ళి చేసినపనికి బాధపడి "నాభర్తను నేనుచొసుకోకుండా చేశారు. ఆయన మందుగుండుసామానుతెస్తారు.  ఈ గుళ్ళూ గోపురాలూ కొట్టించేస్తారు" అని కంగారుపడింది.  గోవిందరాజులకు కాగితంమీద కాటికగోటితో చీటీ