పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెతకసాగింది. చివరికి భర్త పడుకునే గదిలోచూసింది. శిద్ధనుచూసి ఘొల్లుమంది ఇరుగుపొరుగువారికి వినబడింది. ఆలంవారి యింట్లో ఎవరుపోయారో అని విస్తుపోయేరు. మంగమ్మ తల్లితో చెపుతోంది "నేను తమ్ముడిలాగ మగవాడినయితే నాకింతకష్టం లేకుండాపోను. నాకిదు:ఖంలెకుండాపోను - ఎందుకొచ్చినబ్రతుకు నాబ్రతుకుని - అడవిలో మానయిపుడితే మెరుగు - మీరిస్తాననన్ కట్నం యివ్వలేదు. తురకకూడు తింటున్నాడు - నాకోసం యికరాడు - నాకు సారెచీరగట్టి సాగనంపండి" అంది. ఇనుదేవి ఆలమందారకుడికి కబురెట్టింది. వెంటనే ఆలమందారకుడు కచేరికట్టేసి వచ్చేశాడు. "వాడు ఏలితే ఎంత? ఏలకుంటే ఎంత - నేను బంగారుకొట్టులు విడగొట్టాను. వెండికొట్టులుగూడ విడగొట్టాను. కావలసినంత ఐశ్వర్యం- వాడులేకపోతే ఎంత" అన్నాడు. దానికి మంగ "సర్వం తెలిసినవారు. మీరు నేను చెప్పదగినదాన్నికాను - నా ఏడుకొండలవారు నాకుకావాలిగాని మీడబ్బేంచేస్తుంది? నాకు సారె చీర పెట్టిసాగనంపండి - ఏడుకొండలలొ నేవెళ్ళిపొతా - లేదా నేను నూతిపాలో గోతిపాలో అవుతాను" అంది. ఆమాటలు విన్న ఆలమందరకుడు తక్షణం కమ్మర్లకు కబురుబెట్టాడు. ఉల్లిపొరలాంటి ఊక - మంచిగంధం మంట, ఊదేతిత్తులు ఊదుతున్నాయి. సమ్మెటపోటులు - కాగేయిత్తడి - మల్లెపువ్వుచాయ చెంబులు, బిందెలు, గాబులు తయారయ్యాయి. ఏడుకావిళ్ళు సారి, మంచాలూ, కుంచాలూ, వెయ్యిన్నొక్క కావిడిబయలుధేరాయి. బొడ్దున భాగ్యంతెలిపేగంటలతో సన్నకొమ్ముల దోరఆవులు, పిక్కలు సన్నని పిడిగొయ్యల ఆవులు - నడుముసన్నని నాగబొల్లావులు తోలుకుని వెంటబయలుదేరారు పింగళుకుడు. వెళ్ళేమంగను విడువలెక్ ఏడుస్తూ "అమ్మా? నాముద్దులగుమ్మా! నువ్వెళతావా! నాకు ఆడపిల్ల లేకుండాచేసి వెళతావా? శివరాత్రిరోజున శివజాగారాలు చేసేను - మాఘ స్నానాలుచేసేను - ఇవే నాకు నిధులు. పెళ్ళిలెని బ్రాహ్మలకు పెళ్ళిళ్ళు చేసేను - ఇవే నాకు నిధులు. పెళ్ళీలేని బ్రాహ్మలకు పెళ్ళిళ్ళు చేసేను - వడుగులేనిబ్రాహ్మలకు వడుగుచేసేను - నూతులులేనిచోట నూతులు త్రవ్వించాను - అన్నసత్రాలు పెట్టించాను -ఇన్ని మంచిపనుల ఫలితంగా నువ్వు పుట్టావు. ఇంతకాలం వెన్నలో, పాలకుండలోపెంచి బండవెంకడికిచ్చిపెళ్ళిచేసి గోతిలోకి తేసేశాం. నేతిలో గరిటలా నిన్ను పెంచా - నూతిలోచేదలాగ వారువాడతారు. పొద్దుపోయి పొరుగింటికెళ్ళబోకమ్మా,