పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/355

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకరిపిల్లలజోలికి వెళ్ళద్దమ్మ, వాళ్ళందరూవచ్చి నిన్నాడతారు. అక్కడ నీకు దిక్కేమిటితల్లీ! వాల్చినరోకళ్ళు దాటబోకమ్మా. నువ్వువెళ్ళేవి చీకటి గుళ్ళు, చీకతిపొద్దునేలేచి సిరిముఖంకడుగు" అని "ఇక్కడ నాయింట్లో తెద్దెవరుంటారు? గుజ్జనగూళ్ళెవరాడతరు?" అని బేలపోతూ "నీతండ్రిని చూసినట్లు మామనుచూడు. నన్ను చూసినట్లు అత్తనుచూడు. నీ తమ్ముల్ని చూసినట్లు బావల్నిచూడు" అని బిడ్డను కౌగిలించుకొని చెప్పింది.

    మంగమ్మ జతగాళ్ళందరూ "అక్కా!నువ్వెడతావా" అని దీనంగా ముఖాలేసి బావనడిగామని చెప్పమన్నారు.  పెద్దేవాళ్ళందరూ "ఆడదానిబ్రతుకు అరిటాకులాంటిది. ముల్లువచ్చి మీదపడినా తప్పు అరిటాకుదే అంటారు.  మేమంత్6ఆ నీదేవుని అడిగామనిచెపు" అని హితోక్తులుపలికారు. "నీ అన్నగారు చుక్కల్లో అంద్రుడివంటివాడు.  నీ తల్లిదండ్రులు ఆకాశం, భూదేవి లాంటివాళ్ళు.  కీర్తిగల యింటబుట్టావు.  కీర్తితేతల్లీ! నిన్ను గన్న ఋణం తీరురుంది" అని సాగనంపారు.  ప్రయాణం ప్రారంభమయింది.  ఆలంవారిపట్నంలో ఎత్తినసారికావిళ్ళు విమలగిరిపర్వతం దాకా వున్నాయి.  ఇదిచూసిన వెంకన్న బూబమ్మతో "నీకెతురాలు మంగమ్మవస్తోంది.  మీకిద్దరికీ అటుకుంటే నెనిలువలేను.  నేను మళ్ళీ అవతారం దాల్చాలి" అని చాకలి సర్వయ్య, మంగలి వీరేసు, కుమ్మరి గురవయ్య ముగ్గురుంనౌకర్లనూ ముందంపేడు.  మూడుపోగులజందెమేసుకున్నాడు.  ముఖాన విభూతిరేఖపెట్టాడు.  కాషాయిపంచెకట్టేడు  అరిగిన గంటం, చిరిగినపుస్తకం, రాగిబుడ్డి ముంత పట్టుకొని ముసలి బ్రాహ్మణుడిగా తయారయి మంగాదేవికెదురెళ్ళాడు.  మంగమ్మ ఆముసలిబ్రాహ్మణ్ణి చూసింది - పల్లకీలోంచి గభాలునఉరికి దండాలుతాతయ్యా దండాలంది.  ఆముసలిబ్రాహ్మడు తాను వెంకన్న గుడిదగ్గర నైవేద్య్హంచెల్లింఛే బ్రాహ్మణుడనని ఎరుకపరచుకొన్నాడు. తనుజ్ తెచ్చినసారెకు ఏలోటన్నా ఉన్నదా అని ఏమైనాలొటైతే తెచ్చుకుంటానని చూడమంది.
    "మంగమ్మా! నువ్వెంతసారితెచ్చినా నీమొగుడు నీగొడవ వినడమ్మా, నీవూసుతేడు.  బూచీబూచీ అంటాడేకాని నిన్నెలడమ్మా - అత్త మీద కాపురంకూడా నువ్వుచెయ్యలేవే. ఏడుకొండలమీద అన్నంవండాలి. ఆఅన్నాలు నువ్వువండలేవు" అంటుంటే, "నేను అత్తమీద కాపురం