పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/345

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూతురు. ఆనందమయ్యింది. పురోహితుణ్ణి పిలిపించమన్నారు. పేరూరి బ్రాహ్మలొచ్చారు. వెంకన్న, మంగమ్మల పేరుబలాలు చూసేరు. వారి జోదు త్రాచులయ్యారు. సరిపోయిందని గొవిందరాజులు అలమందారకుణ్ణి కట్నాలసంగతి తేల్చమన్నాడు. పచ్చనిపందిల్లో పెళ్ళీసమయంలో పద్దెనిమిదిలక్షలు కట్నం యిస్తామన్నాడు. వెంటనే గోవిందరాజులు సుముఖతను వ్యక్తంచేసి అక్కడ తల్లికీ యిరుగుపొరుగులందరికీ వెంకన్నకు నచ్చితే యీపెళ్ళి ఖాయమేనన్నాడు. తల్లి పేరిందేవి ఎదురెళ్ళింది. "అమ్మా! మేము వెళ్ళినపని సఫలమయ్యింది. మామకూతురే మనకుదొరికింది. మంగమ్మ అందాలు చెప్పనలవికానివి. బంగారు బొమ్మ,ఇకవారి యిల్లుచూస్తేఎత్తైనస్తంబాలతో కట్టినమేడ. చుట్టూ ప్రహరీగోడలు, దర్వాజాలోగిలి".అని విందరాజుచెప్పాడు. అందరికీ సమ్మతమయింది. వారిలో చిన్నన్నపెంచిన రామచిలుకకు మర్నాడు వారి ఆమోదంతెలుపుతూ చీటీవ్రాసికట్టి దానికి ఆలంవారిట్నానికి దారిచెప్పి వదిలారు. అది నల్లనల్లని మేఘాలలొనాడిచి వెళ్ళింది. తెల్లతెల్లని మేఘాల్లో తేలినవెళ్ళింది. పాపికొందలుతిరిగి పరుగెత్తుకెళ్ళి ఆలమందారకుని దండపై వ్రాలింది. ఆలమందారకుడు దాని వీపుమీదచెయ్యేసిదువ్వి చీటీనివిప్పిచూసేడు. సంబరంతో పెళ్ళిపనులు ప్రారంభించారు. ధాన్యపుకొట్టులు విడగొట్టారు. ఆ రాజ్యాన్ని పోయేటి రమణిపిచ్చుకలు నొడ్లుదంచాయి. రాసులొసాయి. పిండికొట్తి పళ్ళాల్లోకెత్తయి. పసుపులుకొట్టారు. తమలపోఅకుల దడులు, పారుటాకులపందిళ్ళు, ముత్యాలముగ్గులు, రత్నాల రంగులు, పగడాల పట్టీలు. ఆలంవారిపట్నం అద్భుతంగా ముస్తాబయింది.

   ఇక దిగువతిరుపతిలో చిలకలద్వారా ఊరూరుకీ పెళ్ళికబుర్లుపెట్టారు.  శుభలేకలు వీధివీధికి వెదజల్లారు.  పల్లెపల్లెకీ పంచిపెట్టాఅరు.
 చిన్నఏనుగెక్కి చిన్నదుర్గవచ్చింది.  చుట్టాలు పట్టాలు మూడుకోట్లు వచ్చారు.  సీకాయ మాకాయ సిద్దిలోచమురు, జాజికాయ, జాపత్రి నలుగుపెట్టేరు. పొత్తుపంచెలుతెచ్చి గుత్తంగాకట్టి, పల్లకీ తెచ్చేరు, పందిట్లోవుంచేరు.  పల్లకీలో పంచెలుంచారు.  బియ్యాలుపోశారు.  కొబ్బరి బొండాలుంచారు. ఇవన్నీ ఒకపెడ యిలా జరుగుతుంటే, మన వేల్పు వెంకన్న జిల్లెదువనంలో దిగులుగా కూర్చున్నాడు.  ఇది చూసిన చాకలి ముసిలి గోవిందరాజులతో చెప్పింది. వెంటనే గోవిందరాజులు జిల్లేడు