పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/344

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఘడియలు మంచివికావని వెనుకను పోదామన్నారు. వచ్చినపరిపూర్తి కాకుండా వెనక్కిమళ్ళడం ఇష్టపడక మరలముందఱకువెళ్ళుటకే నిశ్చయించారు. కడప, కర్నూలు చూసేరు. ఫలితందక్కలేదు. ఆఖరికి అలహాబాదుపట్నంవెళ్ళేరు. అక్కడ మూడువీధులమొగలో కడిమిచెట్టుంది. దానికిందవీళ్ళు కొలువుతీసేరు. ఆపట్నంరాజు అలమందారకుడు. అతడు సప్తసముద్రాలలోస్నానంచేసి అప్పుడేసంధ్యవర్చుకొని ఆదారిన వస్తున్నాడు. ఈ ఆరుగుర్నీ చూసేడు. 'బాబులూ మీదేవూరు? ఏసీమ? ఎవరు? ఎందుకొచ్చారు? మీతల్లిదండ్రుల పేరేమిటి? అని ప్రశ్నించాడు. అప్పుడు గోవిందరాజులు ఇంటిపేరు ఇనకులవారమనీ కాశ్యపగోత్రమనీ మాతల్లిదండ్రులు పేరిందేవి, తిమ్మరాజు అనీ, మాది దిగువతిరుపతి అనీ, తాము ఏడుగురు అన్నదమ్ములమనీ అందులో ఆరుగురికి పెళ్ళిళ్ళయినాయనీ, ఏడవాడికి కన్యకోసం వెదుకుతూ అనేకరాజ్యాలు తిరిగితిరిగ్ యిక్కడికి చేరామన్నాడు. ఇదివిన్న అలమందారకుడు సంభ్రమాశ్చరాలుపొంది వారితల్లి పేరిందేవి తన పెదతండ్రికూతురనీ, కాబట్టి వారంతా తనకు మేనల్లుళ్ళనీ తమబంధుత్వంతెలిపి తనకు యీడిచ్చినకూరుతురుందని, చూపులకు బంగారుబంతి, బంగారుబొమ్మ పేరు మంగమ్మని చెప్పి, చూసుకొవడానికి యింటికి రమ్మన్నాడు. గోవింద్రాజులకు బంగారు కుర్చీ మిగిలిన అయిదుగురకూ ఫ్రేంకుర్చీలూవేసి, చక్కెరపొంగలి ఫలహార మిచ్చి భార్య ఇనుదేవితో దిగివతిరుపతినుంది మంగనదగవచ్చారని, ఆరుగురు బావలు చూదవచ్చేరని మంగకు ముస్తాబుచేసి పంపమన్నాడు.

  ఈలోపల మంగకు చన్నీళ్ళస్నానంచేయించి, సంపంగనూనెరాసి, చక్కగా తలదువ్వి, జారుముడివేసి, కంచుమట్లు కాళ్ళకుతొడికి, బంగారు గాజులు, మువ్వలవడ్డాణం,ముత్యాలపేరు, ఏడువారాలనగలూ పెట్టారు.  కంటికి కాటుక, బుగ్గన చుక్క, చిట్టిమల్లిమొగ్గలచీరా కట్టారు.  వారు కొలువుతీర్చివున్న చోటికి తీరుకువస్తున్నారు.
 వరిపిండి పాదాలకువత్తకుండా చీమకదలనంత చిట్టడుగులేస్తూ, దోమదూరనంత దొడ్డడుగులేస్తూ మంగ మందువాలోకొచ్చింది.  ఆమెను చూసిన గోవిందరాజులు నాతిమంగమ్మను నడిపించమన్నాడు.  నడిస్తే హంసనడక, పలికితే చిలుకపలుకు.  ఆమె అరచేతిలో పద్మం వీపున వింజామర, తమ ఆరుగురు భార్యలకంటె అందగత్తె.  పైగా మామ