పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని పల్లెటూళ్ళల్లో జానపదులు చెప్పేగాధ వీనికి భిన్నంగా వేరే విధంగా వుంటుంది. ఈ కధే కోలసంబరంలో పాటగా పాడేకధ. ఇది అంద్రితం.

                               క ధ
      దిగువ తిరుపతివాసులైన తిమ్మరాజు, పేరిందేవి దంపతులకు తొలిచూలు గర్భాన గోవిందరాజు, రెండవగర్భాన ఉప్మాకవెంకన్న, మూడవగర్బాన యానాంవెకన్న,నాలుగవగర్భాన పొన్నాడవెంకన్న, ఐదవగర్బాన బెండిపూడి వెంకన్న, ఆరవగర్భాన వాడపిల్లివెంకన్న, ఏడవ గర్భాన తిరుపతివెంకన్న పుట్టేరు.  తండ్రి తిమ్మరాజు కాలంచేసేడు.  పేరిందేవి ఏడవకాన్పులో పుట్టిన వేల్పు వెంకన్నకు అరికాలున తామర పద్మం, వీపున వింజామర, బొడ్డున పొన్నారిపువ్వు, చేతులలో శంఖు చక్రాలు, నాలుకన నక్షత్రం ఉన్నాయి.  చూడవచ్చిన అమ్మలక్కలంతా వీడు నరుడుకాడమ్మా నారాయణుడమ్మా  అన్నారు.
  ఈ విధంగాపుట్టిన ఏదుగురూ పెద్దవాళ్ళయ్యారు. విద్యాబుధ్దులు నెర్చుకున్నారు.  మొదటి ఆరుగురికీ పెళ్ళిళ్ళయ్యాయి.  ఎవరిరాజ్యాలు వారు ఏలుకుంటున్నారు.  ఏడవవాడైనవేల్పు వెంకన్నపెంకివాడయ్యాడు. పొగరబోతుగా మారాడు.  పెళ్ళికెదిగాఘు.  అప్పుడు తల్లి పేరిందేవి ఒక అర్ధరాత్రి తలదగ్త్గర బంగారుకుంచంపెట్టుకుని, వేదపుస్తకాలు ప్రక్కనెసుకుని, పట్టుశాలువా ముసుగేసుకుని నిద్దరోతున్న పెద్దకొడుకు గోవిందరాజునిపిలిచి మంచి కన్యనుచూసి వెంకన్నకు యీయేడు పెళ్ళి చేసెయ్యాలంది.  ఆమరునాడు గోవిందరాజు మిగతాఅయిదుగుగు తమ్ముళ్ళకూ ఉత్తరాలు వేసిరప్పించి విషయంచెప్పేడు.  వెంటనేవాళ్ళు చన్నీళ్ళ స్నానాలుఛేసి, కాశిపంచెలాగట్టి, బిళ్ళ గొచీలుపెట్టి, కుచ్చుతలపాగాలు చుట్టి కాళ్ళకుగజ్జెలూ చెతులకు మురుగులూ దండకడియాలూ ముద్దుటుంగరాలూ మెడలో తులసితావననాలూ రుద్రాక్షపేరులూ ధరించి, వంకదండం చేత్తోపట్టుకుని, తల్లిదీవెనపొంది కన్యాన్వేషణకు బయలుదేరేరు.
  మోకాళ్ళపర్వతంఎక్కేరు.  చుక్కలగిరిపర్వతం చేరారు.  గడిమన్యాలుదాటారు.  నేపాల, డిల్లీ, పాంచాల అనేక రాజ్యాలు తిరిగారు.  కన్యరొరకలేదు.  విసుగెత్తినగోవిందరాజు బయలుడేరిన