పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వనంలో తమ్ముడుదగ్గకువెళ్ళి తలమీదచెయ్యేసిదువ్వాడు. ఇంతలో మిగిలిన అన్నలుకూడా వచ్చారు. దిగులుకు కారణం చెప్పమన్నారు. వెంకన్న పల్లకీ వద్దు ఎద్దుకావాలన్నాడు. ఎవరెద్దుకావాలోకోరుకోమంటే కమ్మవారిఎద్దు కోరుకున్నాడు. వెంటనే వారిఎద్దు ఏడుకొండలనుంచి తెప్పించారు. కొమ్ములు చెక్కించి తొడుగులు కట్టించారు. నడుముకి పటకాలు, ముక్కుకి ముగత్రాదు వేశారు. ఆఎద్దునెక్కాడు వెంకన్న. గుఱ్ఱాలు, ఏనుగులు, మందుగుండుసామాను, రామడోలు మేళాలతో లక్ష్మీవారంనాడు ఆలంవారిపట్నానికి తరలివచ్చారు. విడుతుల్లో దిగారు.

   ఇక మంగచెలికత్తెలు "పెద్దక్కా! చిన్నక్కా! రండర్రా మీరు, ఆలంవారిఅల్లుడొచ్చాడు చూసొద్దాం" అని వెళ్ళొచ్చి ఆకతాయిచెలులు మంగను మేలమాడమొదలెట్టేరు. "మంగమొగుడువెంకన్న వెనుకకు చూస్తేఎనుకోతిరూపు, ముందునుంచి చూస్తే ముదికోతిరూపు, ముందుపళ్ళు వూడాయి.  మునుచెంప నెరిసింది.  కనురెప్పలునెరిసాయి.  ముసలి మొగుడు" అని మంగను ఏడిపిస్తున్నారు.  ఎద్దుకీదొచ్చాడు అని వేళాకోళం పట్టారు.  ఇదివిన్న ఆలమందారకుడు పరుగెట్టికెళ్ళి "మీ నంబువరింటిలో పల్లకీలేకుంటే కాకిచేతనాకు కబురుపంపళేకయారా జోడుపల్లకీలు పంపించేవాణ్ణి" అన్నాడు.  ఇదివిని గోవిందరాజులు మేము ఎద్దుమెదరావడం మా ఆనవాయితీ అనీ, ఆనవాయితీప్రకారం అలా చేశామన్నాడు.  ఆ మాటవిన్న ఆలమందారకుడు పానకాలకావిళ్ళు పట్టించుకొచ్చాడు.  ఎదురుతళ్ళింపులతో అని పుచ్చుకున్నారు.  ఆరాత్రంతా ఊరేగించారు.  ఊరేగింపు పందిట్లోకొచ్చింది.  వెళ్ళికి బంగారుపీటలేసారు.  వధూవరులకు బ్రాహ్మలు బ్రహ్మముళ్ళేశారు.  వెంకన్న మంగమ్మలను కూర్చోబెట్టారు.  గౌరీపూజచేయించి అల్లాలూ బెల్లాలూ ఆవుపాలూ బియ్యం అన్నీ తెచ్చారు.  విఘ్నేశ్వరపూజకూడా జరిగిపోయించి.  మంచిముత్యాల తలంబ్రాలు ముమ్మారు మంగమ్మనెత్తిపై వెంకన్న పోస్తే వెంకన్న నెత్తిమీద మంగపోసింది. తల్లి ఇనుదేవి కాళ్ళుకడిగి  కన్యాధానమిచ్చింది.  ఇక కట్నాలదగ్గకొచ్చారు- గోవిందరాజులడిగాడు "నువ్వు యిస్తానన్న కట్నం యిప్పుడివ్వకపోతే మాతమ్ముడు వెంకన్న పెళ్ళిఅరుగేదిగడు" అన్నాడు.  ఆలమందారకుడు అదిరిపోయాడు.  ప్రస్తుతం తనదగ్గర