పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/333

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భా మా కా లా పం

      భామ అంటే సత్యభామ, కలాపం అంటే కలహం, లేక కలత అని అర్ధం.  దీనికి కధ ప్రధానంగా ఏమీ ఉండదు.  ఇదంతా సత్యభామ విరహాభినయమే.  అష్టవివిధ నాయికాభినాం ఈ క్లాపానికి ప్రాణం.  దీనికి నట్టువాంగంగా సూత్రధారుడు, మద్దెలవాయించేవారు, వయెలిన్ వాయించేవారు వుంటారు.  ఈ సూత్రధారిదివేషం బ్రాహ్మణవేషం. ఇతడే చెలికత్తెమాదవిగానూ, చెలికాడు మాధవుడుగానూకూడా వ్యవహరిస్తాడు.  కూచిపూడివారివల్ల దీనికి విశేషప్రశస్తివచ్చింది.  సిద్ధేంద్రయోగిదీనికి మూలవిరాట్టు.  ఇది చతుర్విధాబినయాలకు సంగీత సాహిత్యాలకు నిలయం.
     సత్యభామ కృష్ణుడు తనమీద అలిగి వెళ్ళి పోయాడని చెలికత్తెకు (సూత్రధారుడికి) చెప్పేతీరు మనోజ్ఞం.
 
        * "ఓయమ్మా ! నొకానొకనాడు పడకమందిరంలోహంసతూలికాతల్పామందు, కేళిగాగృహముయందు వజ్ర, వైఢూర్య, గోమేధిక, పుష్యరాగ, మరకత, మాణీక్యములు స్థాపించినటువంటి నగరియందు పరవశించి యుండగా స్వామివారువచ్చి గానం చేసినారమ్మా, నేను గాఢాంధకారమైనటువంటి సుషుప్తిలోనుండగా కన్ను తెరదినానమ్మా. అంతటస్వామి వారువచ్చి శయ్యమీదకూర్చున్నాదమ్మా, నాకు లకతనిద్ధురసమయం గనుక, దిగ్గునలేచినానమ్మా.  లేచి పరిమళద్రవ్యములు మొదలైన చందన గోష్టి చేసినానే. అంతట స్వామివారు పరున్నారే, నేనుకూర్చున్నానే, పాదసేవ చేసినానే - అప్పుడు స్వామివారు నన్ను తొడపై కూర్చుండబెట్టుకుని అమూల్యమైనటువంటి ఆభరణములు అలంకరించి నిలువుటద్దం తెచ్చి ఎదుటవుంచి నీడలుచూపించి "సత్యభామా! నీవుచక్కనిదానవా నేనుచక్కనివాడనా?" అని అడిగితే వోయమ్మ! అడిగేటటువంటివరకు, ఆదబుద్ధిఅపరబుద్దికనుక, అబలలముగనుక, తెలియక నేనేచక్కనిదాననంటినే వోయమ్మా!. అంతట స్వామివారు నామీద కోపముచేసి దిగ్గునలేచి చక్కా పోయెనేవోయమ్మా! మనస్వామివారు ఎందుబాయెనో, ఎక్కడబాయెనో

  • 'యక్షగానము" వ్యాసం (శ్రీనివాసాక్రవర్తి)నాట్యకళ. ఫిబ్రవరి-మార్చి 190 పు.12