పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/334

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెదుకుదామటే దోయమ్మా?" అలాగ అలిగివెళ్ళీపోయిన కృసునికి "శ్రీమద్ రత్నాకరపుత్రికా విడంబాన" అనిప్రారంభించి - చివరకు "చాయంగల విన్నపములు తప్పో ఒప్పో ఎంచక యీ మదనుని బారినుండి నన్ను విముక్తిరాలను చేయగదే. ఇట్లు, నీ ప్రియసతి, సత్యభామ". అని పాడుతూ వ్రాస్తున్నట్టు అభినయిస్తూ లేఖ మాధవికిచ్చి రాయబారమంపే టప్పుడు శకునాలుచూసి "శకునాలూ మంచివాయెనమ్మా! అని దరువు పాడుతూపంపే తీరు అత్యంతమనోహరం. ఇక్కడ మాధవికి కృష్ణుని ఆనవాలు చెప్పేవిధానం, మాధవి (బ్రాహ్మడు) వికటప్రశ్నలు బలేచమత్కారంగా ఉంటాయి. "అమ్మా! సత్యభామా నీప్రియుడు ఏసరెవాడు? ఎలావుంటాడు! రూపుతేఖలేంటి? నామధేయమేంటిసత్యభామా!" అంటాడు. దానికామె 'నాప్రియుడు -చక్రము ధరించినవాడే ఓయమ్మా 'అంటే, విదూషకుడు ఆలోచించి పెద్ద తెలిసిపోయినట్టు 'ఓహో మనప్రక్కవీధిలోనున్న కుమ్మరిగురవయ్య కొడుకాఅమ్మా?" అంటాడు.

   దీనికామె 'కాధే -ఫించము ధరించినవాడే ఓయమ్మా 'అంటే, 'ఊరావల మకాంవున్న చెంచువాళ్ళకుర్రాడా అమ్మా?' అంటాడు.  "కాదే - మకర కుండలములు ధరించినవాడే ఓయమ్మా" అంటే, "ఓహో పౌరోహిత్యం పంతులు పెద్దకొడుకా?" అంటాడ్.  "కాదే-శంఖముధరించినవారే ఓయమ్మా" అంటే "ఓహో పెద్దవీధి జంగాలకుర్రాడా?' అని అడుగుతాడు.  అదికాదే అని ఏదో చెప్పబోతుంటే, "పోనీ- ఇంతకీ నీభర్త నామధేయమేమిటమా?" అని అడిగితే, "అవ్వ" అని నోరునొక్కుకుని సిగ్గుపడుతూ ఇంతకమంది ఆడవారిలో, ఇంతలేసి మగవారిలో సత్యభామ తన మగని పేరు చెప్పుటయా? సిగ్గుగాదా?" అంటుంది, "మరెలాగమ్మా - పోనీయింకో ఆనవాలెదేనా చెప్పుమరి" అంటాడు.  అప్పుడు "అదికాదే - ఆయన బావామరదల సందువారే ఓయమ్మ" అంటే, "ఏవిటీవిటి? బావామరదల సందా? ఆసందెక్కడుందమ్మా? పేరివారిసందు, నేతివారిసందు, వెచ్చావారిసందు, పుచ్చావారిసందు, లీలంవారిసందు, నీలంవారిసందు విన్నాముగాని యీ సందు ఎక్కడా కనబడలేదే" అంటే, 'అబ్బా! అదికాదే - బావామరదుల సందువారంటే బలరామునికి సాత్యకికి మధ్యవాడే ' అంటుంది.
    "అప్పుడు "ఓహో అతనా? గోపాలకృష్ణుడాఅమ్మా? సరిసరి. ఈ సారి అర్ధమయింది" అని మాట్లాడడం పండితులు యిది ఎనక్రానిజం అని తప్పుపట్టినా జానపదులు నిండుగా ఆనందించే ఘట్టమిదే.