పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/335

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
  • "ప్రదర్శన ప్రారంబమునకుముందు నాట్యశాస్త్రవిహితమైన పూర్ఫరంగము ప్రవర్తితమగును. అటుపిమ్మట కధాప్రారంభము. భామ రంగస్ధలముమీదకు వచ్చుటకుముందు ఒక తెర పట్టుదురు. దానికిరువైపులను కాగడాలు వెలిగించుదురు. అంతట భామ తన పొడుగుపాటి జడను తరపై వేసి సభలోని పండితులను సవాలుచేయును. ఈ ఘట్టంనే 'వేణీప్రబంధము 'అందురు. కూచిపూడివర్తకులు ముఖ్యంగా బామవేషధారి నృత్యమందేకాక సంగీతసాహిత్యములందునూ, వేద వేదాంగాది విద్యలందునూ నిష్ఠాతులుగా నుండెడైవారు. ఆజడనట్లు వేయుటయనగా శాస్త్రార్ధచర్చయందుగాని, భామవేషాభినయమందుగాని తనతో సాటి ఎవరూలేరని తెలుపుట. భామ అట్లు తెరమీదజడవేసి జడయొక్క పుట్టుకనుగూర్చిచెప్పి (అదిదేవశిల్పియగు మయుని సృష్టియట) శస్త్రార్ధచర్చ చేయడం. అంతట రెండుకాగడాలమీదాచల్లిన గుగ్గిలంఉ మెరపులో భామ తనమొగము చూపును. రెండవసారి యున్నట్లే తెరను నడుమువరకు దింపుదురు. ఇంక మూడవసారి తెరను పూర్తిగా తీసి వేయుదురు. "భామనే సత్యభామనే" అనే దరువుతో నటి రంగప్రవేశం చేస్తుంది. కూచిపూడివారి ఈ భామాకలాపప్రదర్శననానికి ముగ్డుడై గొల్కొండనవాబు వారికి కూఛిపూడిని అగ్రహారంగా యిచ్చాడట.
  సత్యభామ జడకధను మరొకవిధంగా కూడా చెబుతారు.
    • "క్షీరసాగర మధనం జరిగింది. అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని పంచుకోవడంలో సురాసురలలో కలహంరేగింది. ఆ కలహం మాన్పి అమృతం పంచడానికి విష్ణుమూర్తి జగన్మోహినిరూపం దాల్చవలసివచ్చింది. ఈ జడ ఆనాటి జగన్మోహినిరూపాన్ని ఉపసంహరరించు కుంటూ ఆజడను కత్తిరించి పదిలపరిచారు. కృష్ణావతారంలో నరకాసుర వధానంతరం శ్రీకృష్ణుడు ఆజడను సత్యభామకు బహుకరించాడు. అప్పటినుండి ఆజడను సత్యభామ దరిస్తుంది.

  • డా|| సి.యస్.ఆర్ అప్పారావు, తెలుగునాటక వికాసము పు.143
    • సహదేవ సూర్య ప్రకాశరావు, రూప కళ పు.28




1