పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/332

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాయకరాజుల తరువాత మహారాష్ట్రప్రభువులుకూడా వీనిని బాగానేపొషించారు. తహాజీ ఎన్నో యుక్షగానాలు వ్రాశారు. దానిలో 'విష్ణుపల్లకి",'శివపల్లకి ', సేవాప్రబంధాలు లోక ప్రసిద్ధాలు. ఈకాలంలో నుదురుపాటి వేంకనార్యుడు "పార్వతీకళ్యాణం" యక్షగానం వ్రాశారు. నారాయణతీర్ధులు "పారిజాతాపహరణం" వ్రాశారు.

   యక్షగానాల్లో పదములు దరువులు, ఏలలు, ధవళలు, మంగళహారతులు, ఉయాలపాటలు, చందమామపాటలు, సుద్దులు అష్టకములు విరివిగా పాడబడతాయి. గద్యతో కధాసంధి నిర్వహిస్తారు.
 
    దీనికి జెరదుప్పటె. 'బసవపురాణంలోజవనికరప్పించి ' అని ప్రయోగించడంవల్ల నాటితెర్ అప్పటికప్పుడు అడ్డుపెట్టే దుకూలమని తెలుస్తుంది.  తెర తొలగించగానే నటీమణిముఖం అందరికీ స్పష్టంగా కనిపించడానికి కాగడాలమీద గుగ్గిలంజల్లి భగ్గుమని మండించేవారు.  ప్రేక్షకులు రంగస్థలం నలువైపులా కూర్చునేవారు.  నటి ఆడుతూ పాడుతూ నాలుగు వైపులకీ తిరుగుతూ కధ వినిపించేది.  ఇందులో శృంగార, కధలు రసాలకి ప్రాముఖ్యం ఎక్కువ.  వర్ణనలుకూడా ఎక్కువే.  ప్రాచీన యక్షగానాలలో ఓబయమంత్రి రచించిన 'గరుడాచలము ' యక్షగానమొకటి.  ఇది 'సుగ్రీవునివిజయం ' అంటే ముదుదేమోకూడా! చరిత్రకారులు యింకా ఒక నిర్ధారణకు రాలేకపోయారు.  ఇందుపాత్రలు అమాయకురాలు చెంచులక్ష్మి, మాయకుడు నరసింహుడు, ఈ మాయలెగిరిన లక్ష్మె, వీరిని లోబరుచుకోవడంలో వారి యిష్టాలనుబట్టి నృసింహుడుచేసే వాగ్ధానాలు, చేష్టలు ఈ కధకు ఆయువుపట్టులు.
      ఈ యక్షగానాలు మొదట కేవల గేయరూపాలుగానూ (క్రీడాభిరామంలో జెక్కుల పురంద్రి,) తరువాత సంవాదరూపంలోనూ (సుగ్రీవ విజయంఅ, సౌభరితచరిత్ర) కనిపించి తరువాత వీధి నాటకంలో అ భేదం పొందాయి.
    వీనిలో కలాపములుకూడా చేరి వీని ప్రసిద్ధిని పెంచాయి.  ముఖ్యంగా చెప్పుకోదగ్గ లాపాలు భామాకలాపం, గొల్లకలాపం,