పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ నృత్యదృశ్యములు తర్వాత జక్కులవారు నగరములందు ప్రయోగింపజొచ్చిరి. సింగి, సింగడు మారి రామ, నల, సీతాది పాత్రలు వచ్చినవి. జాతర్లలో యక్ష, గాంధర్వాది వేషములుధరించి వేశ్యలు ప్రదర్శించినవి కావునను నృత్యదర్మములకంటే గేయధర్మము లధికముగా కలవిగావుననూ ఇవి యక్షగానములనబడేను." ఇలా కురవంజిల పరిణామ క్రమమే యక్షగానం.

  కంకంటిపాపరాజు "విష్ణుమాయావిలాసం" అనే యక్షగానం వ్రాశారు.  త్యాగరాజు "నౌకాభంగం", 'భక్తప్రహ్లాదత్గరిత్ర ', "శ్రీరామజననం" మొదలగు యక్షగానాలు వ్రాశారు. యక్షగానాలకు తంజావూరు నాయకరాజుల కాలం స్వర్ణయుగం.  ఇందు మొదట సూత్రధారుడు ప్రార్ధన, కవిస్థుతి, షష్ట్యంతాలు పూర్తిచేశాక విధూషకుడు ప్రవేశిస్తాడు.  వచ్చినవారందర్నీ, వారికి సహాయం చేసినవారినీ పేరుపేరునా ప్రశ్నిస్తాడు-

            "సభారంగమునకు అందరూ వచ్చినారా ?
              చిత్తం.
             కరణంగారూ ?
             చిత్తం.
             మునసబుగారు ?
             చిత్తం
             పెద్దలందరూ వచ్చినారా !
             చిత్తం.
             సెహభాష్ - వారందరినీ ఉచితాసనముల నలంకరింపెజేసి
             చిత్తం. యుంటిరా ?
           

ఇలా ప్రేక్షకులందర్నీ పరామర్శించి ప్రదర్శన ప్ర్రారంభిస్తారు. నాయకరాజులకాలంలోనే యక్షగానం పురాణాలనుంచి సాంఘిక యితివృతాలతో కాలిపెట్టింది. అనే విజయరాఘవుడు వ్రాసిన "రఘునాధాభ్యుదయం", (రఘునాధనాయకుని దినచర్య) ఆనాటి కవయిత్రి రంగాజమ్మ తన భర్త. విజయరాఘవునిపైవ్రాసిన "మన్నారు దాస విలసము", కోనేటి దీక్షితకవి "విజయరాఘవకళ్యాణం" మొదలగునవి.